‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీలో స్పెషల్ సాంగ్ కోసం.. రంగంలోకి హాట్ బ్యూటీ

by Kavitha |   ( Updated:2024-01-26 13:56:22.0  )
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీలో స్పెషల్ సాంగ్ కోసం.. రంగంలోకి హాట్ బ్యూటీ
X

దిశ, సినిమా: సంక్రాంతికి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ రిలీజ్ అయినప్పటికి.. ఎందులోను సాంగ్స్ పెద్దగా ఆకట్టుకోలేదని చెప్పాలి. మహేష్ బాబు ‘గుంటూరు కారం’ లోని కుర్చీ మడతపెట్టి పాట తప్ప, మరే ఇతర చిత్రంలోని పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అందుకే తాజాగా స్పెషల్ సాంగ్స్‌ని ఇష్టపడే సినీ ప్రియుల ఆకలిని తీర్చే పాట రాబోతోంది. హీరోయిన్లు స్పెషల్ సాంగ్ చేయడం కొత్త కాదు. ఆల్రెడీ చాలా మంది చేశారు. అయితే...హీరోయిన్ ఈషా రెబ్బా ఇప్పటి వరకు ఒక్క స్పెషల్ సాంగ్ కూడా చేయలేదు. కాగా తాజాగా ఈ అమ్మడు ఓ ఐటమ్ సాంగ్ కి ఓకే అనేసిందట.

టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా రూపొందుతున్న సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. నేహా శెట్టి, అంజలి హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతం కూడా ఉందట. దాని కోసం ఈషా రెబ్బాను దర్శక, నిర్మాతలు అప్రోచ్ అయ్యారట. ఆమె వెంటనే ఓకే చెప్పింది.

Advertisement

Next Story

Most Viewed