Filmfare Awards 2024: ఫిలిం ఫేర్ నామినేషన్స్‌లో స్టార్ హీరోకు డబుల్ ధమాకా .. నామినేషన్స్ ఫుల్ లిస్టిదే!

by Anjali |
Filmfare Awards 2024: ఫిలిం ఫేర్ నామినేషన్స్‌లో స్టార్ హీరోకు డబుల్ ధమాకా .. నామినేషన్స్ ఫుల్ లిస్టిదే!
X

దిశ, సినిమా: 2024 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ కోసం సినీ ప్రియులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో అవార్డులను దక్కించుకునేందుకు పలు సినిమాలు రెడీగా ఉన్నాయి. తాజాగా 2024 లో పోటీ పడుతోన్న మూవీస్ లిస్ట్ రిలీజ్ అయింది. మరీ ఈ ఈవెంట్‌ను ఎప్పుడు, ఎక్కడ నిర్వహిస్తారనేది త్వరలోనే వెల్లడించనున్నారు. అయితే 2024 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌లో నానికి డబుల్ ధమాకా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. ఉత్తమ నటుడు కేటగిరీలో నేచురల్ స్టార్ నాని నేమ్ రెండు సార్లు వచ్చింది. ఒకటి దసరా సినిమా, మరోటి హాయ్ నాన్న. ఈ రెండు చిత్రాలకు నాని నామినేట్ అయ్యారు.

ఇక ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌లో ఉత్తమ సినిమాలు చూసినట్లైతే..‘దసరా, హాయ్‌ నాన్న, సామజవరగమన, మిస్‌శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి, సలార్‌: పార్ట్‌-1 సీజ్‌ ఫైర్‌, బలగం, బేబి’.

ఉత్తమ నటీమణులు చూసినట్లైతే.. మృణాళ్‌ ఠాకూర్‌ (హాయ్‌ నాన్న), అనుష్క (మిస్‌శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి), కీర్తిసురేశ్‌ (దసరా), సమంత (శాకుంతలం), వైష్ణవీ చైతన్య (బేబీ).

ఉత్తమ హీరోలు: ఆనంద్‌ దేవరకొండ (బేబీ), ధనుష్‌ (సర్‌),చిరంజీవి (వాల్తేర్‌ వీరయ్య), నాని (దసరా), ప్రకాశ్‌రాజ్‌ (రంగమార్తాండ), బాలకృష్ణ (భగవంత్‌ కేసరి), నాని (హాయ్‌ నాన్న), నవీన్‌ పొలిశెట్టి (మిస్‌శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి).

ఉత్తమ సహాయ నటులు: రుపా లక్ష్మీ (బలగం), రమ్యకృష్ణ (రంగమార్తండ), రోహిణి మోల్లెటి (రైటర్‌ పద్మభూషణ్‌), శ్రీలీల (భగవంత్‌ కేసరి), శ్రియారెడ్డి (సలార్‌: పార్ట్‌-1 సీజ్‌ ఫైర్‌), శ్వేతరెడ్డి (మంత్‌ ఆఫ్‌ మధు), శ్యామల (విరూపాక్ష).

ఉత్తమ దర్శకులు: సాయి రాజేశ్‌ (బేబీ)అనిల్‌ రావిపూడి (భగవంత్‌ కేసరి), శౌర్యువ్‌ (హాయ్‌ నాన్న), శ్రీకాంత్‌ ఓదెల (దసరా), వేణు యెల్దండ (బలగం), ప్రశాంత్‌నీల్‌ (సలార్‌:పార్ట్‌-1 సీజ్‌ ఫైర్‌), కార్తిక్‌ దండు (విరూపాక్ష).

ఉత్తమ సహాయ నటులు: విష్ణు ఓఐ (కీడా కోలా), బ్రహ్మానందం (రంగ మార్తండ), విష్ణు ఓఐ (కీడా కోలా), కోట జయరాం (బలగం), రవితేజ (వాల్తేర్‌ వీరయ్య), నరేశ్‌ (సామజవరగమన), దీక్షిత్‌శెట్టి (దసరా).

బెస్ట్ లిరిక్స్: అనంత శ్రీరామ్ (ఓ రెండు ప్రేమ మేఘాలిలా - బేబీ), కసర్ల శ్యామ్ (చమ్కీల అంగిలేసి - దసరా), కసర్ల శ్యామ్ (ఊరు పల్లెతూరు - బలగం),

పి. రఘు 'రేలరే రేలా' (లింగి లింగి లింగిడి - కోటబొమ్మాళి పి.ఎస్), అనంత శ్రీరామ్ (గాజు బొమ్మ - హాయ్ నాన్న).

ఉత్తమ గాయని: దీ (చమ్కీల అంగీలేసి -దసరా), మంగ్లీ (ఊరు పల్లెటూరు-బలగం), శ్వేత మోహన్‌ (మాస్టారు.. మాస్టారు -సర్‌), చిన్మయి శ్రీపాద (ఓడియమ్మ – హాయ్‌ పాప), చిన్మయి శ్రీపాద (ఆరాధ్య – ఖుషి), శక్తిశ్రీ గోపాలన్‌ (అమ్మాడి -హాయ్‌ నాన్న).

ఉత్తమ గాయకులు: హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ (ఖుషి -టైటిల్‌ సాంగ్‌), రామ్‌ మిర్యాల (పొట్టిపిల్ల -బలగం), శ్రీరామ చంద్ర (ఓ రెండు ప్రేమ మేఘాలు -బేబీ), సిధ్‌ శ్రీరామ్‌ (ఆరాధ్య – ఖుషి), పీవీఎన్‌ఎస్‌ రోహిత్‌ (ప్రేమిస్తున్నా -బేబీ), అనురాగ్‌ కుల్‌కర్ణి (సమయ-హాయ్‌ నాన్న).

Advertisement

Next Story

Most Viewed