Pawan Kalyan: ఒకే ఒక్కటివ్వండి చాలంటూ.. పవన్ స్టార్ కి ఫ్యాన్స్ రిక్వెస్ట్..

by Prasanna |
Pawan Kalyan:  ఒకే ఒక్కటివ్వండి చాలంటూ.. పవన్ స్టార్ కి ఫ్యాన్స్ రిక్వెస్ట్..
X

దిశ, సినిమా : హీరోలందరూ సినిమాలు చేసుకుంటూ వారి అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నారు. కానీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఫుల్ బిజీ అయ్యారు. ఈ హీరోకి ఏ రేంజ్ లో ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఫ్యాన్స్ ఆయన్ని తెర చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఒక్క అప్‌డేట్ గురు.. ఒకే ఒక్కటి చాలు .. మళ్ళీ ఇంకోసారి మిమ్మల్ని అడిగాము అంటూ పవన్ అభిమానులు రిక్వెస్ట్ చేస్తున్నారు. మేకర్స్ కూడా ఇవ్వాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, అప్‌డేట్ ఇవ్వాలంటే వాళ్ళ దగ్గర ఉండాలిగా.. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. చూడబోతుంటే .. ఓజి నుంచి అప్డేట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. మరి అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఇటు వైపు ఫ్యాన్స్ ఏమో పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే ఎప్పుడెప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తున్నారు.. ఇంకో వైపు రాజకీయాల్లో ఆయన లేనిదే పనులు జరిగేలా లేవు.. ఇలా రెండు పడవల మీద కాలు వేసి పవర్ స్టార్ రెండు బ్యాలెన్స్ చేయగలడని తెలుస్తుంది. సెప్టెంబర్ 2న పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఓజి నుంచి అదిరిపోయే అప్డేట్ రానుందని టాక్ వినిపిస్తుంది. ఈ మూవీ టీజర్ వచ్చి ఏడాది అయినా క్రేజ్ మాత్రం రోజు రోజుకి పెరుగుతుంది. తాజాగా, థమన్ ట్వీట్ చేసారు కాబట్టి ఈ సినిమా మొదటి పాట విడుదలయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు. ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story