'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్' మూవీ టీజర్‌తో సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్..

by Hajipasha |   ( Updated:2023-05-19 06:46:11.0  )
కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ మూవీ టీజర్‌తో సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్..
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం 'కిసీ కా భాయ్‌ కిసీ కా జాన్‌'. ఫర్హాద్ దర్శకత్వంలో తెరక్కెకుతున్న ఈ మూవీలో టాలీవుడ్ హీరో వెంకటేశ్‌ కీ రోల్‌ పోషిస్తుండగా.. జగపతి బాబు, భాగ్యశ్రీ, భూమికా చావ్లా, మాళవికా శర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వీరితో పాటు రామ్ చరణ్ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఇక తాజాగా రిపబ్లిక్‌ డే సందర్భంగా ఒకరోజు ముందే (జనవరి 25న) ఈ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్‌. ఇక అన్నట్లుగానే సాలీడ్ టీజర్‌ను 'పఠాన్' మూవీతో పాటుగా థియేటర్స్‌లో విడుదల చేయగా.. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. థియేటర్స్‌లో ఒకేసారి ఇద్దరు హీరోలకు సంబంధించిన చిత్రాలు చూడటంతో సోషల్ మీడియాలో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఈ టీజర్‌లో ట్రెడిషనల్ లుక్‌లో వెంకటేష్, విలన్‌గా జగపతి బాబు లుక్ అదిరిపోయింది. వెంకీతో పాటుగా సల్మాన్ కూడా పంచెకట్టి చిందులేయడం ఆకట్టుకుంటుంది.

Advertisement

Next Story

Most Viewed