చరణ్‌తో పెళ్లి జరిగిన కొత్తలో బాడీ షేమింగ్ ఎదుర్కొన్నా: ఉపాసన

by Hamsa |   ( Updated:2023-04-02 08:46:21.0  )
చరణ్‌తో పెళ్లి జరిగిన కొత్తలో బాడీ షేమింగ్ ఎదుర్కొన్నా: ఉపాసన
X

దిశ, సినిమా: చరణ్ వైఫ్ ఉపాసన గురించి పరిచయం అక్కర్లేదు. అపోలో హాస్పిట‌ల్స్ డైరెక్టర్స్‌లో ఒక‌రైనా ఆమె సేవా గుణంతో తనకంటూ గుర్తింపు సంపాదించుకుంది. ఇక తాజాగా ముంబైలో ఓ మీడియా ఇంట‌ర్వ్యూలో ఉపాసన చాలా విష‌యాలు పంచుకున్నారు. ‘చరణ్ నా కామన్ ఫ్రెండ్ వల్ల పరిచయం అయ్యారు. మొదటి నుంచి కూడా చరణ్ నాతో ఏదో ఒక పందెం వేస్తుండే వాడు. అలా మా మధ్య ప్రేమ మొదలైంది. కానీ చరణ్‌తో పెళ్లి జరిగిన కొత్తలో బాడీ షేమింగ్ ఎదుర్కొన్నా.

నేను అందంగా లేనని, లావుగా ఉన్నానని, డబ్బు కోసమే చరణ్‌ను పెళ్లి చేసుకున్నానన్నారు. కానీ నన్ను ట్రోల్ చేసిన వారెవ్వరికీ నేను ఎవరో తెలియదు. మనం విమర్శలను స్వీకరించే విధానంలోనే మనం అంటే ఏంటో తెలుస్తుంది. ఇలాంటి ట్రోల్స్‌కు నేను కుంగిపోలేదు. వాటిని జయించాను. నా విషయంలో నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. ఆ విమర్శించిన ప్రతి ఒక్కరికి, ఎలా సమాధానం చెప్పానో నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు నేనొక చాంపియన్‌లా ఫీల్ అవుతున్నా’ అని చాలా కాన్‌ఫిడెంట్‌గా చెప్పారు ఉపాసన.

ఇవి కూడా చదవండి: నిండు గర్భంతో నటి పూర్ణ చేసిన పనికి మండిపడ్డ నెటిజన్స్..

Advertisement

Next Story