The Kerala Story : ఇదే నా చివరి సినిమా అనుకుంటా: Adah Sharma

by Aamani |   ( Updated:2023-05-15 10:34:04.0  )
The Kerala Story : ఇదే నా చివరి సినిమా అనుకుంటా: Adah Sharma
X

దిశ, సినిమా: కాంట్రవర్షియల్ మూవీగా పేరు తెచ్చుకున్న ‘ది కేరళ స్టోరీ’ అన్ని అవాంతరాలు దాటుకొని మే 5న రిలీజైంది. విడుదలైన మొదటి రోజు నుంచి మంచి రెస్పాన్స్‌తో.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది. ఇక ఈ మూవీలో కీలక పాత్ర పోషించిన నటి అదా శర్మ ఎనలేని ప్రశంసలు అందుకుంటోంది. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అదా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది. అదా మాట్లాడుతూ ‘నేను చేసే ప్రతి సినిమాను, అదే నా చివరి సినిమాగా భావిస్తా. నాపై ఎవరికైనా నమ్మకం ఉంటుందా లేదా? నాకు మరో అవకాశం వస్తుందా రాదా? అనే ఆలోచన ఉండదు. ‘ది కేరళ స్టోరీ’ సినిమా కూడా అదే నమ్మకంతో తీశారు. కానీ మహిళా ప్రధానపాత్రలో నటించిన ఈ మూవీని ఇంతగా ఆదరిస్తారని, ప్రశంసలు వస్తాయని కలలో కూడా ఊహించలేదు. ప్రపంచవ్యాప్తంగా విజయం సాధించిన ‘ఓం శాంతి ఓం’ మూవీలోని షారుఖ్ ఖాన్ పాత్రకు ఎంతటి ఆదరణ వచ్చిందో.. ఇప్పుడు అదే తరహా ఫీలింగ్ నేనూ ఎక్స్ పీరియన్స్ చేస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చింది అదా.

Read more:

అన్నీ మంచి శకునములే’ విజయ్ దేవరకొండతో చేద్దామనుకున్న.. కానీ వేస్ట్ అనిపించింది : డైరెక్టర్ నందిని రెడ్డి

Advertisement

Next Story