స్లీవ్‌ లెస్‌లో యంగ్ బ్యూటీ కిర్రాక్ ఫోజులు.. కుర్రాళ్ల ఫ్యూజులు అవుట్ !

by Javid Pasha |   ( Updated:2024-04-25 14:12:09.0  )
స్లీవ్‌ లెస్‌లో యంగ్ బ్యూటీ కిర్రాక్ ఫోజులు.. కుర్రాళ్ల ఫ్యూజులు అవుట్ !
X

దిశ, సినిమా : ప్రస్తుతం గ్లామర్ ఫీల్డ్ ఫుల్ ఎంటర్టన్మైంట్ మాత్రమే కాదు, బోల్డ్ ఎక్స్‌పోజింగ్‌లకు కేరాఫ్ అడ్రస్ కూడా. ఒకప్పటిలా ఒంటినిండా దుస్తులతో సంప్రదాయ బద్ధంగా నటిస్తామనే హీరోయిన్లు ఇక్కడ సక్సెస్ అందుకోవడం కష్టంగా మారుతోంది. ఈ మధ్య వస్తున్న సినిమాలైనా, సిరీస్‌లు అయినా ఏదో ఒక సందర్భంలో బోల్డ్ కంటెంట్‌ను కొంతైనా ప్రదర్శిస్తున్నాయి. అలాగే స్కిన్ షోలతో సినిమాల్లో ఆకట్టుకుంటున్న పలువురు హీరోయిన్లు ఆ తర్వాత కొంతకాలానికి అవకాశాలు రాకపోయినా మునుపటి ఆదరణ, గుర్తింపు ఏమాత్రం తగ్గకుండా జాగ్రత్త పడుతున్నారు. అందుకోసం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.

మూవీస్‌లో అవకాశాలు ఉన్నా లేకున్నా, తగ్గినా పెరిగినా తమ అందాల ఆరబోతతో, బోల్డ్ లుక్స్‌తో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ అభిమానులను అలరిస్తున్నారు పలువురు హీరోయిన్లు. కొందరైతే కుర్రాళ్ల ఫ్యూజులు అవుట్ అయ్యేలా కిర్రాక్ ఫోజులతో ఆకట్టుకుంటున్నారు. అలాంటి వారిలో ఈషా రెబ్బా ఒకరు. మొదట్లో మోడలింగ్ చేస్తూ తన కెరీర్ ప్రారంభించిన ఈషా ‘లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్’ మూవీతో సినీ ఎంట్రీ ఇచ్చింది.

మొదటి సినిమాతోనే కుర్రాళ్ల మనసు దోచుకున్న ఈషా రెబ్బా ఆ తర్వాత ‘అంతకు ముందు ఆ తర్వాత’ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. ఏమైందో ఏమో కానీ ఈ సినిమా తర్వాత ఆమెకు అవకాశాలు తగ్గాయి. దీంతో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘అరవింద సమేత’ ‘వీర రాఘవ’, అలాగే అక్కినేని వారుసుడి చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వంటి సినిమాల్లో నటించినప్పటికీ సక్సెస్ అందుకోలేకపోయింది.

మూవీస్‌లో అవకాశాలు తగ్గిన ఈషా వెబ్ సిరీస్‌లో నటిస్తూ తన ఉనికి చాటుకునేందుకు సోషల్ మీడియాలో స్కిన్ షోలు, గ్లామర్ షోలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా స్లీవ్ లెస్ జాకెట్ వేసుకొని, తన డస్కీ అందాలతో కిర్రాక్ ఫోజులిస్తూ ఫొటో షూట్ చేసిన ఈషా రెబ్బా వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. ‘సూపర్’ అంటూ కొందరు. ‘కుర్రాళ్ల ఫ్యూజులు ఎగిరిపోయేలా ఉన్నావు’ అంటూ ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed