Shine Tom Chacko: మొన్ననే ఎంగేజ్‌మెంట్.. ఇంతలోనే బ్రేకప్ .. తాను మళ్లీ ‘సింగిల్‌’ అంటూ ఒప్పుకున్న నటుడు

by Prasanna |
Shine Tom Chacko: మొన్ననే ఎంగేజ్‌మెంట్.. ఇంతలోనే బ్రేకప్ .. తాను మళ్లీ ‘సింగిల్‌’ అంటూ ఒప్పుకున్న నటుడు
X

దిశ, సినిమా: ప్రేమకి ఒకానొక సమయంలో విలువ ఉండేది కానీ, ఇప్పుడు ఒక అవసరం అయిపోయింది. లవ్ పేరుతో ఎదుటి వాళ్ళని మోసం చేసేందుకు కూడా వెనుకాడటం లేదు. దీని వలన గాయపడిన మనుషులు ఎందరో ఉన్నారు. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ప్రేమ కోసం జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అయితే కొందరు అక్కడే ఆగిపోతున్నారు మరి కొందరూ గుణపాఠం అనుకుని జీవితంలో ముందుకు వెళ్తున్నారు. తాజాగా మలయాళ నటుడుకి ఇలాంటి ఘటనే ఎదురైంది.

కొద్దీ రోజుల నుంచి ప్రేమ, రిలేషన్‌షిప్‌ అంటూ నిత్యం వార్తల్లో షైన్‌ టామ్ చాకో నిలుస్తున్నాడు. తనూజ అనే అమ్మాయితో పీకల్లోతూ ప్రేమ ప్రయాణాన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు. ఇంకొన్ని రోజుల్లో మ్యారేజ్ డేటును అనౌన్స్ చేస్తారని ఫ్యాన్స్ వెయిట్ చేసారు. కానీ,ఎవరూ ఊహించలేని విధంగా అందరికీ షాకింగ్ న్యూస్ చెప్పాడు టామ్ చాకో.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో షైన్ టామ్ చాకో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఇప్పుడు నేను మళ్లీ ‘సింగిల్‌’ అంటూ తన బ్రేకప్ వార్తలకు చెక్ పెట్టాడు. ‘ ఆమెతో నా బంధం అర్దాంతరంగా ముగిసింది. పెళ్లి కాకుండానే ఆ బంధానికి ముగింపు చెప్పాల్సి వచ్చింది. ప్రేమ ఒక్కటే సరిపోదు అర్ధం చేసుకునే మనసు కూడా ఉండాలి. ఇంకో అమ్మాయి కోసం వెతుకుతున్నాను దీని వల్ల చాలా సమస్యలు సవాళ్లు ఎదురవుతున్నాయి’ అంటూ చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed