Dasara Movie :'దసరా' టికెట్ బుకింగ్స్ షురూ..

by sudharani |   ( Updated:2023-03-25 12:15:15.0  )
Dasara  Movie  :దసరా టికెట్ బుకింగ్స్ షురూ..
X

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ పాన్ ఇండియా లెవల్‌లో మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఇక నాని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తుండగా.. తెలుగు స్టేట్స్‌లో టికెట్ బుకింగ్ ఓపెన్ అయినట్టు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఇక మిగతా కీలక ప్రాంతాల్లో త్వరలోనే బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి. రికార్డు స్థాయిలో ఆన్‌లైన్‌లో టికెట్స్ బుక్ కాగా.. మూవీ ఇప్పటికే ప్రేక్షకులకు ఎంతగా రీచ్ అయిందో తెలుస్తోంది. మొత్తానికి తొలి పాన్ ఇండియా మూవీతో నాని కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ ఉండొచ్చనే అంటున్నారు విశ్లేషకులు.

Advertisement

Next Story