- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Double Ismart: డబుల్ ఇస్మార్ట్ ట్విట్టర్ రివ్యూ.. హిట్టా..? ఫట్టా..?
దిశ, సినిమా: స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్టు 15) సందర్భంగా రామ్ పోతినేని నటించిన ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆల్రెడీ ప్రీమియర్స్ స్టార్ట్ అయ్యాయి. కాగా అభిమానులంతా సోషల్ మీడియాలో తమ స్పందన తెలియజేస్తున్నారు. కావ్య థాపర్ కథానాయికగా నటించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ 162 నిమిషాల నిడివి ఉన్న హీరో చిన్నతనం సన్నివేశాలతో స్టార్ట్ అవుతుంది. తర్వాత సంజయ్ దత్ బిగ్ బుల్ రూల్‌లో కనిపిస్తాడు. ఇందులో రామ్ స్టైలిష్ లుక్ అదిరిపోయింది కానీ ప్రేక్షకుల అంచనాలకు చేరుకోలేకపోయింది. హీరో ఎనర్జీని హైలెట్ చేస్తూ పూరి జగన్నాధ్ చూపించారు. కామెడీ, టైమింగ్, బీజీఎం కూడా అంతంత మాత్రానే ఉన్నాయని కామెంట్లు పెడుతున్నారు. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే కాస్త బెటర్‌గా ఉందని అంటున్నారు. సెకండ్ హాఫ్ లో దర్శకుడు మార్క్ డైలాగులు, ట్విస్ట్ లు, మదర్ సెంటిమంట్‌లతో బాగానే తెరకెక్కించాడు కానీ ఇస్మార్ట్ శంకర్ జనాల్ని అంతగా ఆకట్టుకోలేదు.