- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్‌పై నన్ను ప్రశ్నలు అడగొద్దు.. హీరోయిన్ ఆన్సర్‌కు షాక్‌లో నెటిజన్లు!
దిశ, సినిమా: మలయాళ (Malayalam) సినీ ఇండస్ట్రీలో జస్టిస్ హేమ కమిషన్ రిపోర్ట్ ప్రజెంట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలు, లైగింగ వేధింపులు, సమస్యలు ఆ రిపోర్ట్‌లో చాలా స్పష్టంగా వివరించారు. ఇప్పుడు ఇదే ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. దీనిపై ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు తమ గొంతు వినిపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పలు పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే.. సింగర్, హీరోయిన్ ఆండ్రియా జెర్మియా మాత్రం జస్టిస్ హేమ కమిషన్ ఇచ్చిన నివేదికపై తనను ప్రశ్నించొద్దు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
ప్రజెంట్ వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న ఆండ్రియా.. తాజాగా తిరువాన్మియూరులో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా మీడియా.. జస్టిస్ట్ హేమ కమిషన్‌పై ప్రశ్నలు అడిగింది. దీనిపై స్పందించిన ఆండ్రియా జెర్మియా.. ‘చిత్రపరిశ్రమలో మహిళల లైంగిక వేధింపులపై జస్టిస్ హేమ కమిషన్ ఇచ్చిన నివేదికపై నో కామెంట్స్, ఈ అంశంలో ఎలాంటి ప్రశ్నలు అడగొద్దు’ అని తెలిపింది. నిజానికి ఏ విషయంలో అయినా తనధైన స్టైల్లో స్పందిస్తూ.. స్ట్రాంగ్‌గా ఆన్సర్స్ ఇచ్చే ఆండ్రియా.. ఇప్పుడు సంచలనంగా మారిన జస్టిస్ హేమ కమిషన్‌పై నన్ను ఎలాంటి ప్రశ్నలు అడగొద్దు అనడంతో షాక్ అవుతున్నారు నెటిజన్లు.
- Tags
- Andrea Jeremiah