- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Varun Dhawan: అలా ప్రవర్తించొద్దు కొంచమైనా మానవత్వం చూపించండి.. వరుణ్ ధావన్ పోస్ట్
దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ గత ఏడాది ‘బవాల్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అలాగే ఇటీవల ఆయన నటించిన స్త్రీ-2 బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా వరుణ్, సమంత కాంబోలో తెరకెక్కిన ‘సిటాడెల్’ సిరీస్ విడుదలకు సిద్ధంగా ఉంది. నవంబర్ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం. అయితే వరుణ్ ఓ వైపు వరుస సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటున్నాడు. పలు పోస్టులు పెడుతూ అందరిని ఆలోచింప చేస్తున్నాడు. ఈ క్రమంలో.. తాజాగా, వరుణ్ ధావన్ ఫొటోగ్రాఫర్లకు ఓ సలహా ఇస్తూ పోస్ట్ పెట్టాడు.
అసలు విషయంలోకి వెళితే.. సెప్టెంబర్ 11న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మలైకా అరోరా ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె తండ్రి అనిల్ మోహతా ముంబైలోని టెర్రర్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఈ సంఘటన ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రమంలో మలైకా కుటుంబాన్ని పరామర్శించడానికి పలువురు సినీ సెలబ్రిటీలు ఆమె ఇంటికి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో మలైకాను కొంతమంది ఫొటో గ్రాఫర్లు పిక్స్ తీయడంతో వరుణ్ ధావన్ రియాక్ట్ అయ్యాడు.
ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ కూడా షేర్ చేశాడు. ‘‘ఇలాంటి క్లిష్ట సమయంలో కెమెరాలను గురిపెట్టి దు:ఖంలో ఉన్న కుటుంబాన్ని ఫొటోలు తీయడం అత్యంత సున్నితమైన విషయం. దయచేసి మీరు దీన్ని చేసినప్పుడు ఎవరైనా ఏమి చేస్తున్నారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఆలోచించండి. ఇది మీ పని అని నేను అర్థం చేసుకున్నాను. కానీ కొన్నిసార్లు మరొక వ్యక్తి ఫొటోలు తీసినప్పుడు ఎలా ఫీల్ అవుతారో తెలుసుకోండి. దయచేసి అలా ప్రవర్తించొద్దు కొంచమైనా మానవత్వం చూపించండి’’ అని రాసుకొచ్చాడు. ప్రజెంట్ వరుణ్ ధావన్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.