ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకొని రెండో భార్యగా మారిన తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా?

by Jakkula Samataha |
ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకొని రెండో భార్యగా మారిన తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా?
X

దిశ, సినిమా : చిత్ర పరిశ్రమలో ప్రేమ, పెళ్లి, విడాకులు అనేవి చాలా కామన్. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఇండస్ట్రీలో ఇది ఎక్కువగా జరుగుతోంది. అయితే చాలా మంది ఈ కాలం నటీనటుల్లోనే ఈ లవ్, బ్రేకప్, మ్యారేజ్ అనేది ఎక్కువగా ఉంది అనుకుంటారు. కానీ గతంలో కూడా ఇవన్నీ చాలా కామన్ అంట. ముఖ్యంగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొంత మంది ప్రేమలో పడి వారి కెరీర్‌ను కూడా వదిలి వేసినట్లు తెలుస్తోంది. అయితే ఓ నటి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత, ఓ రాజకీయ నాయకుడిని పెళ్లి చేసుకొని, చిత్రపరిశ్రమకు గుడ్ బై చెప్పిదంట. ఇంతకీ ఆ నటి ఎవరు అనుకుంటున్నారా?

కన్నడ చిత్ర పరిశ్రమలో తన నటన, అందంతో ఎంతో మందిని ఆకట్టుకున్న ముద్దుగుమ్మ రాధికా కుమార స్వామి. ఈ నటి చాలా సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. అంతే కాకుండా కొన్ని సినిమాలను కూడా ఆమే స్వయంగా నిర్మించిది. అయితే ఈ బ్యూటీ తీసుకున్న ఓ నిర్ణయం కన్నడ చిత్ర పరిశ్రమలోనే కాకుండా రాజకీయాల్లో కూడా కలకలం రేగింది. రాధిక జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామితో రహస్య ప్రేమాయణం నడిపించింది. అంతే కాకుండా ఆమె ఆయనను 2010లో రహస్యంగా వివాహం చేసుకున్నట్లు కూడా తెపింది. దీంతో ఒక్కసారిగా కన్నడ పరిశ్రమ షాక్‌కు గురైంది. వారికి ఓ పాప కూడా, రాజకీయనాయకుడు కుమారస్వామికి 47 ఏళ్ల వయసులో నటి రాధికపై మనసు పడ్డాడు..వీరి మధ్య ప్రేమ చిగురించి, చివరికి రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో రాధిక కుమారస్వామికంటే 27 సంవత్సరం చిన్నది. ఇక వీరిద్దరికి ఇది రెండో పెళ్లి.. వీరి వివాహం అప్పుడు సంచలనంగా మారినట్లు సమాచారం. ఇప్పుడు ఈ బ్యూట కోట్లరూపాయలకు యజమానిగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక రాధికా కుమారస్వామి తెలుగులో కూడా రెండు సినిమాల్లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. తారకరత్న హీరోగా తెరకెక్కిన భద్రాద్రి రాముడు సినిమాలో హీరోయిన్‌గా చేసింది. అలాగే అవతారం మూవీలో కూడా నటించినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed