Tollywood: పదేళ్ళ నుంచి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్న ఏకైక టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?

by Prasanna |   ( Updated:2024-10-04 07:10:24.0  )
Tollywood: పదేళ్ళ నుంచి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్న ఏకైక టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్ : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర మూవీ రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. మిక్స్డ్ టాక్ తో రన్ అవుతున్నా కలెక్షన్స్‌లో మాత్రం దూసుకెళ్తుంది. ఇప్పటికే రూ.300 కోట్ల మార్క్ ను దాటేసి రూ. 500 కోట్ల కొట్టడానికి రెడీగా ఉంది. కొరటాల శివ ఆచార్య తో ఫ్లాప్ అందుకున్న ఈ మూవీతో పెద్ద హిట్ అందుకున్నాడు. అయితే, సోషల్ మీడియాలో ఎన్టీఆర్ సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతుంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏ హీరోకి లేని రికార్డ్ ఒకటి యంగ్ టైగర్ సొంతం చేసుకున్నాడు . అదేంటో ఇక్కడ చూద్దాం..

ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా వరుసగా ఏడు హిట్లు కొట్టిన ఘనత ఎన్టీఆర్ పొందాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో టెంపర్ మూవీ హిట్, సుకుమార్ డైరెక్షన్ లో నాన్నకు ప్రేమతో హిట్, కొరటాల శివ డైరెక్ట్ చేసిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్, బాబీ డైరెక్షన్ లో వచ్చిన జై లవ కుశ హిట్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సామెత సూపర్ హిట్, రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఆర్ఆర్ఆఃర్ మూవీ బ్లాక్ బస్టర్, ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా హిట్. ఇలా వరుసగా ఏడు హిట్‌లు కొట్టి తనకంటూ సెపరేట్ రికార్డును క్రియోట్ చేసుకున్నాడు. ఇది చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ నటనలో మా అన్నను కొట్టే హీరో ఇంకా పుట్టలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read More : NTR: ఇచ్చట ప్లాప్ డైరెక్టర్లకు హిట్ ఇవ్వబడును.. ఎవరొచ్చినా ఓకే అంటూ కామెంట్స్ చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్

బ్రేక్ ఈవెన్ సాధించాలంటే దేవర మూవీ ఇంకా ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలంటే..?

Advertisement

Next Story

Most Viewed