శ్రీజ మాజీ భర్త శిరీష్ రెండో భార్య ఎవరో తెలుసా.. ఆమె బ్యాగ్‌గ్రౌండ్ నెట్టింట వైరల్!

by Hamsa |   ( Updated:2024-06-19 09:48:27.0  )
శ్రీజ మాజీ భర్త శిరీష్ రెండో భార్య ఎవరో తెలుసా.. ఆమె బ్యాగ్‌గ్రౌండ్ నెట్టింట వైరల్!
X

దిశ, సినిమా: చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ లంగ్స్ డ్యామేజ్ కారణంగా కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే శ్రీజ 2007లో శిరిష్‌ను ప్రేమించి ఇంట్లోంచి వెళ్లిపోయి గుడిలో పెళ్లి చేసుకోవడంతో అప్పట్లో వీరి వివాహం సంచలనం సృష్టించింది. కానీ వీరిద్దరు ఓ కూతురు పుట్టాక విడాకులు తీసుకుని విడిపోయారు. శ్రీజ కల్యాణ్ దేవ్‌ను రెండు పెళ్లి చేసుకుని ఓ కూతురికి జన్మనిచ్చింది. కానీ వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిగా ఉంటున్నారు. ఇద్దరు పిల్లలు మాత్రం శ్రీజ దగ్గరే ఉన్నారు.

ఇదిలా ఉంటే.. శ్రీ మాజీ భర్త శిరీష్ కూడా రెండో పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈ విషయం పెద్దగా ఎవరికీ తెలియదు. అతని మరణంతో శిరీష్ రెండో భార్యకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. జనాలు కూడా ఆమె ఎవరా అని నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే శిరీష్, శ్రీజతో విడాకులు అయ్యాక 2019లో ఓ డాక్టర్‌ను పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. ఆమె పేరు వివాన.. హైదరాబాద్‌కు చెందినదని తెలుస్తోంది. పెళ్లి తర్వాత నుంచి శిరీష్-వివాన చెన్నైలో నివాసం ఉంటున్నారు. అంతా బాగానే ఉందనుకుంటున్న క్రమంలో.. అతనికి లంగ్స్ డ్యామేజ్ అయ్యాయి. అప్పటి నుంచి చికిత్స తీసుకుంటున్నప్పటికీ ఆరోగ్యం విషమించడంతో శిరీష్ బుధవారం మరణించినట్లు సమాచారం.

Read More : చిరంజీవి కూతురు శ్రీజ మాజీ భర్త కన్నుమూత

చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ మృతి.. శ్రీరెడ్డి సంచలన పోస్ట్!

Advertisement

Next Story

Most Viewed