Mahesh Babu: తెలుగు సినీ ఇండస్ట్రీలో మహేష్ కు మాత్రమే సొంతమైన రికార్డు ఏంటో తెలుసా?

by Prasanna |
Mahesh Babu: తెలుగు సినీ ఇండస్ట్రీలో మహేష్ కు మాత్రమే సొంతమైన రికార్డు ఏంటో తెలుసా?
X

దిశ, సినిమా : తెలుగు సినీ ఇండస్ట్రీలో మహేష్ బాబు స్థానం ప్రత్యేకం. కృష్ణ తనయుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ సూపర్ స్టార్ ప్రస్తుతం టాలీవుడ్లో దూసుకుపోతున్నాడు. ఈ రోజు మహేష్ బాబు పుట్టిన రోజు. ఈ సందర్భంగా సెలబ్రిటీలు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.

ఇక మహేష్ సినీ కెరీర్ చెప్పుకోవాలంటే.. పోకిరి మూవీ తర్వాత అతని రేంజ్ మొత్తం మారిపోయింది. ఈ సినిమాతో పండుగాడు కాస్తా సూపర్ స్టార్ గా మారాడు. దూకుడు, బిజినెస్ మ్యాన్, భరత్ అనే నేను, సరిలేరు నీకెవ్వరూ, మహర్షి, సర్కారు వారి పాట, గుంటూరు కారం లాంటి హిట్ సినిమాలను తీసి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. అయితే ఈ రోజు పుట్టిన రోజు సందర్భంగా మహేష్ కి సంబందించిన ఆసక్తికర విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మహేష్ బాబు తీసిన 27 సినిమాలలో 8 నంది అవార్డులు అందుకోవడం విశేషం. ‘రాజకుమారుడు’ మూవీతో మొదటి సారి ఉత్తమ నటుడిగా నందిని .. అందుకోగా.. ఆ తర్వాత టక్కరి దొంగ, అర్జున్, నిజం, అతడు, దూకుడు, శ్రీమంతుడు, మురారి సినిమాల ద్వారా కూడా నంది అవార్డుకు ఎంపికయ్యారు. టాలీవుడ్ లో ఈ రికార్డు ఒక్క మహేష్ కు మాత్రమే సొంతం. మా అన్న రికార్డ్స్ ఎవరు బ్రేక్ చేయలేరంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed