- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రేణుదేశాయ్‌తో విడాకులు.. పవన్ కళ్యాణ్‌ను మొదటి సారి కలిసినప్పుడు అకీరా ఏం అడిగాడో తెలుసా?

దిశ, సినిమా : రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె బద్రి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్‌తో ప్రేమలో పడి, ఆయనను వివాహం చేసుకుంది. తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడం తో విడాకులు తీసుకుంది. ఇక వీరికి ఒక కూతురు, ఒక కొడుకు కూడా ఉన్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరు రేణు దేశాయ్ వద్దే పెరుగుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ కూడా పిల్లల కోసం అప్పుడప్పుడు వారి వద్దకు వెళ్లేవాడంట. అంతే కాకుండా ఒకానొక సమయంలో, రేణు దేశాయ్ పిల్లల కోసం మేము, స్నేహితులుగా కొనసాగుతున్నాం అని చెప్పిన విషయం తెలిసిందే.
ఇక, ఓ ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్ చేసింది. విడాకుల తర్వాత పవన్ కళ్యాణ్‌ను అకీరా, ఆద్య మొదటి సారి కలిసినప్పుడు ఏం మాట్లాడుకున్నారో తెలిపింది. పవన్‌కు అకీరా, ఆద్య అంటే చాలా ఇష్టం అంట. అకీరా పవన్ కళ్యాణ్ తెలుగులో మాట్లాడుకుంటారు. వారు మొదటి సారి కలిసినప్పుడు కూడా హెల్త్, ఫిలాసఫీ, లైఫ్ గురించి మాట్లాడుకుంటారంట. ఇక ఆద్య మాత్రం పవన్‌కు చాలా కండీషన్స్ పెడుతుందంట. తనతో మరాఠీలోనే మాట్లాడాలని తెలపడంతో పవన్ కళ్యాణ్ ఆద్య కోసం మరాఠీ కూడా నేర్చుకున్నాడంట. ఇక అకీరా , పవన్ కళ్యాణ్‌ల మధ్య ఎప్పుడూ సినిమా ప్రస్తావన రాదు. వీరు చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారని చెప్పుకొచ్చింది. ఆమె గతంలో చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.