చంద్రమోహన్ మేనల్లుడు స్టార్ ప్రొడ్యూసర్ అని తెలుసా..? ఆయన తీసిన సినిమాలు ఇవే..!

by Sathputhe Rajesh |   ( Updated:2023-11-11 09:07:10.0  )
చంద్రమోహన్ మేనల్లుడు స్టార్ ప్రొడ్యూసర్ అని తెలుసా..? ఆయన తీసిన సినిమాలు ఇవే..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ టాలీవుడ్ నటుడు చంద్రమోహన్ (82) ఈ రోజు తుది శ్వాస విడిచారు. అనేక కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. 175 సినిమాల్లో హీరోగా, మొత్తంగా 900 చిత్రాల్లో ఆయన నటించారు. ఆయన కుటుంబం నుంచి ఎవరూ సినిమాల్లోకి రాలేదు. కానీ చంద్రమోహన్ స్వయానా సోదరి కొడుకు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు. ఆయనే శ్రీదేవి మూవీస్ బ్యానర్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్. చంద్రమోహన్ ప్రోద్భలంతో శ్రీదేవి మూవీస్ అనే సినిమా నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు. చంద్రమోహన్, రాజేంద్రప్రసాద్ లతో ‘చిన్నోడు పెద్దోడు’ అనే ఒక సినిమా తీశారు. తర్వాత బాలయ్యతో ‘ఆదిత్య 369’, ‘వంశానికొక్కడు’, ‘ఊయల’ ‘అనగనగా ఒక అమ్మాయి’, ‘భలేవాడివి బాసు’, ‘నాని జెంటిల్మెన్’, ‘సమ్మోహనం’ సినిమాలను తీశారు. రీసెంట్‌గా సమంత కీలక పాత్రలో ‘యశోద’ సినిమాను తెరకెక్కించారు.

Read More..

చంద్రమోహన్ చివరి మాటలు ఇవే.. కన్నీరు పెట్టించిన కామెంట్స్

Advertisement

Next Story

Most Viewed