‘డబుల్ ఇస్మార్ట్’ కోసం సంజయ్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

by Prasanna |   ( Updated:2023-08-05 11:23:21.0  )
‘డబుల్ ఇస్మార్ట్’ కోసం సంజయ్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
X

దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో నటినటులు భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీలలో నటిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ సీనియర్ హీరోలు మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్ పాత్రలో నటిస్తూ సందడి చేస్తున్నారు. ఇందులో సంజయ్ దత్ ఒకరు. ‘కేజీఎఫ్’ సినిమాలో విలన్‌గా నటించి మెప్పించిన ఆయన.. ఇప్పుడు రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ ద్యారా ప్రేక్షకుల ముందుకురానున్నాడు. ఇక తాజాగా ఈ సినిమా కోసం సంజయ్ దత్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏమిటంటే ఈ సినిమా కోసం సంజయ్ దత్ 60 కాల్ షీట్స్ ఇచ్చారట. ఇందుకోసం ఆయన ఏకంగా రూ.15 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది.

Advertisement

Next Story