ఇంత బోల్డ్ క్యారెక్టర్ చేయించడానికి Vaishnaviని ఎలా కన్విన్స్ చేశారో తెలుసా? బయటపడ్డ సంచలన నిజం!

by Anjali |   ( Updated:2023-07-20 05:30:05.0  )
ఇంత బోల్డ్ క్యారెక్టర్ చేయించడానికి Vaishnaviని ఎలా కన్విన్స్ చేశారో తెలుసా? బయటపడ్డ సంచలన నిజం!
X

దిశ, వెబ్‌డెస్క్: షార్ట్ ఫిలిమ్స్‌లో నటించి బాగా పాపులరైన ‘వైష్ణవి చైతన్య’ తెలుగు సినిమా స్ర్కీన్‌పై ‘బేబీ’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ఈ బేబీ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ మూవీ ప్రస్తుతం భారీ వసూళ్లను రాబడుతూ.. బాక్సాఫీసు వద్ద రికార్డును సృష్టిస్తోంది. ఏకంగా 5 రోజుల్లో రూ.38కోట్లు కలెక్ట్ చేసి సంచలనాన్ని క్రియేట్ చేసింది ఈ మూవీ. అయితే ఈ చిత్రంలో నటించడానికి వైష్ణవి అగ్రిమెంట్ కారణంగానే సైన్ చేసిందని ప్రస్తుతం నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి.

దర్శకుడు సాయి రాజేష్.. ఈ హీరోయిన్ వద్దకు వెళ్లి, కథను వివరించగా ‘‘ఇంత బోల్డ్ పాత్ర నేను అస్సలు చేయనని చెప్పేసిందట.’’ అయినా కూడా ఈ రోల్‌కు వైష్ణవే బాగా సూట్ అవుతుందని ఆయన రెండు మూడుసార్లు ఆమె చుట్టూ తిరిగి మరి ఆమెను ఫోర్స్ చేశారట. కాగా, వైష్ణవి కెరీర్ మొదట్లోనే ఇలాంటి పాత్ర చేస్తే నామీద బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుందంటూ బాధపడిందట. ఒకవేళ ఈ మూవీ చేశాక నువ్వు నెగటివ్ హీరోయిన్‌గా టాక్ వస్తే, నా తర్వాత వచ్చే మూడు సినిమాలల్లో నీకే హీరోయిన్‌గా అవకాశం ఇస్తానని అగ్రిమెంట్‌పై సైన్ చేయించుకున్నారట. ఆ కారణంగానే వైష్ణవి ఈ ప్రాజెక్టుకు ఓకే చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఇది నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

Also Read: Varun Tej - Lavanya పెళ్లి డేట్ ఫిక్స్.. ఆ ప్రత్యేకమైన ప్లేస్‌లోనే!

Advertisement

Next Story