పవన్ కళ్యాణ్‌కు పవర్ స్టార్ బిరుదు ఎలా వచ్చిందో తెలుసా?

by samatah |   ( Updated:2022-09-02 05:20:40.0  )
పవన్ కళ్యాణ్‌కు పవర్ స్టార్ బిరుదు ఎలా వచ్చిందో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా సోదరుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన అన్నకు తగ్గ తమ్ముడు అనిపించుకుంటున్నాడు. ఇక పవన్‌కు ఉన్న ఫాలోయింగ్ ఇక ఏ హీరోకు ఉండరు. తాను డైలాగ్ చెప్పాడంటే.. ఆ కిక్కే వేరుంటది. అయితే చాలా మంది పవన్ కళ్యాణ్‌ను పవర్ స్టార్ అని పిలుస్తుంటారు. మరి పవన్ కళ్యాణ్‌కు ఆ బిరుదు ఎలా వచ్చింది. ఆయన్ను పవర్ స్టార్ అని ఎందుకు పిలుస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

సినిమాలలోకి రాకముందు పవన్ తన చిన్న అన్నయ్య నాగబాబు, అంజనా ప్రొడక్షన్ బ్యానర్‌లో నిర్మించిన పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడంట. ఆ తర్వాత, అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి సినిమా ద్వారా చిత్రపరిశ్రమకు పరిచయం అయ్యారు. కానీ ఆసినిమా అంత సక్సెస్ కాలేదు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో గోకులంలో సీత అనే సినిమాలో హీరోగా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమా కూడా సూర్ హిట్టైంది. అయితే ఈ సినిమాలో పోసాని కృష్ణ మురళి, మాటలు అందించారు. ఆ తర్వాత ఓ ప్రెస్ మీట్‌లో ఆయన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. పవర్ స్టార్ అని సంబోధించారంట. అప్పడు పత్రికలన్నీ కూడా పవన్ కళ్యాణ్ పేరు ముందు పవర్ స్టార్ అని యాడ్ చేశాయి. అలా పవన్ కళ్యాణ్‌కు పవర్ స్టార్ అని బిరుదు వచ్చింది.

ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్, సినిమాలలోనే కాకుండా రాజకీయాలలో జనసేనానిగా ప్రజలలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.

Also Read : పవర్ స్టార్‌కు మెగాస్టార్ స్పెషల్ బర్త్ డే విషెస్

Also Read : పవర్ స్టార్ విశ్వరూపం.. అదిరిపోయిన 'పవర్ గ్లాన్స్' (వీడియో)

Advertisement

Next Story