Chiranjeevi గ్యారేజీలో ఎన్ని Luxury Cars ఉన్నాయో తెలుసా? వాటి Price తెలిస్తే దిమ్మతిరిగి పోతుంది..

by Prasanna |   ( Updated:2023-08-23 15:52:19.0  )
Chiranjeevi గ్యారేజీలో ఎన్ని Luxury Cars ఉన్నాయో తెలుసా? వాటి Price తెలిస్తే దిమ్మతిరిగి పోతుంది..
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవికి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అద్భుతమైన నటనతో కొన్ని కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇకపోతే చిరంజీవికి కార్లు అంటే ఎంత ఇష్టమో మనకు తెలిసిందే. కాగా ఆయన గ్యారేజీలో ఎలాంటి కార్లు ఉన్నాయనే విషయంపై సోషల్ మీడియాలో ఒక లిస్ట్ వైరల్ అవుతుంది. చిరు గ్యారేజీలో బ్రిటన్, జర్మనీ బ్రాండ్ కార్లు కూడా ఉన్నాయని తెలుస్తుండగా.. వాటి డీటెయిల్స్ ఏంటో చూద్దాం.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లలో ‘రోల్స్ రాయిస్’ కంపెనీకి చెందిన ‘ఫాంటమ్’ ఒకటి చిరంజీవి గ్యారేజీలో ఉంది. దీని ధర దాదాపు రూ.8 కోట్ల వరకు ఉంటుంది. ఈ కారుని చిరంజీవి 53వ పుట్టినరోజుకు రామ్ చరణ్ గిఫ్ట్‌గా ఇచ్చాడట. ఇక టయోటా బ్రాండ్‌కు సంబంధించిన రెండు ‘ల్యాండ్ క్రూయిజర్’ కార్లు కూడా ఉన్నాయని టాక్. సేఫ్టీకి ప్రసిద్ధి చెందిన ఈ కారు ధర రూ. 1 కోటి కంటే ఎక్కువ ఉంటుంది. అలాగే ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన రేంజ్ రోవర్ వోగ్ కూడా మెగాస్టార్ గ్యారేజ్‌లో ఉంది. దీని ధర రూ.1 కోటి వరకు ఉంటుంది. చిరంజీవి ఈ కారుని ఎక్కువగా ఉపయోగిస్తారు. దీంతోపాటు గ్యారేజ్‌లో టొయోటా వెల్ఫీర్ కారు కూడా ఉండగా.. దాని ధర కూడా సుమారు రూ.1 కోటి వరకు ఉంటుంది. ఇవి మాత్రమే కాదు మెగాస్టార్ దగ్గర అత్యంత ఖరీదైన ప్రైవేట్ జెట్‌ కూడా ఉందట. దీని ఖరీదు సుమారు రూ.250 కోట్ల వరకు ఉంటుంది. ఇక తెలుగు ఇండస్ట్రీని ముందు నుంచి ఏలుతున్న చిరు.. ఇలాంటి మోస్ట్ లగ్జరీ లైఫ్‌ను లీడ్ చేయడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదని చెప్పాలి.

ఇవి కూడా చదవండి :

‘Pushpa 2’ నుంచి వైరల్ పిక్ రిలీజ్..

నాగార్జున యంగ్ గా ఉండటానికి రోజూ రాత్రి తప్పకుండా ఆ పని చేయాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed