హార్దిక్‌ పాండ్యాతో విడాకులు.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన నటాషా!

by Hamsa |   ( Updated:2024-07-12 14:08:54.0  )
హార్దిక్‌ పాండ్యాతో విడాకులు.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన నటాషా!
X

దిశ, సినిమా: నటి నటాషా, టీమ్ ఇండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా విడాకులు తీసుకోబోతున్నట్లు గత కొద్ది కాలంగా వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అలాగే వీరిద్దరు గత కొద్ది కాలంగా విడి విడిగా ఉంటున్నారంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్‌కు కూడా నటాషా వెల్లకపోవడంతో పాటుగా.. నటాషా పుట్టినరోజు హార్దిక్ విష్ చేయలేదు. దీంతో వీరిద్దరు నిజంగానే విడాకులు తీసుకున్నారని కన్ఫార్మ్ అయ్యారు. ఇటీవల హార్ధిక్ ముఖేష్ అంబానీ ఇంట్లో జరుగుతున్న పెళ్లి వేడుకలకు కూడా నటాషా వెళ్లకపోవడంతో.. విడాకులు తీసుకున్నారని అందుకే వెళ్లలేదని అంతా పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.

ఈ క్రమంలో.. తాజాగా, నటాషా విడాకులపై స్పందిస్తూ ఇండైరెక్ట్‌గా ఓ పోస్ట్ పెట్టింది. ‘‘ కొంతమంది జనాలు ఏమీ తెలియకుండా, తెలుసుకోకుండా ఒకరిని జడ్జ్ చేస్తూ ఉంటారు. అసలు ఒక సంఘటన గురించి ఏమీ తెలుసుకోకుండా ఊహించుకుంది మాట్లాడుతారు. కానీ డైరెక్ట్‌గా జడ్జ్ చేస్తూ అపార్థం చేసుకుని ఇతరుల జీవితాల గురించి అంటారు. అలాగే ఒక వ్యక్తి గురించి ఏదైనా రూమర్ వస్తే అది నిజమా? కాదా అని తెలుసుకోకుండా కనీసం సానుభూతి కూడా చూపించకుండా జడ్జ్ చేస్తూ మాట్లాడుతారు’’ అని చెప్పుకొచ్చిన వీడియోను షేర్ చేసింది. ఇక అది చూసిన వారంతా తమ విడాకుల గురించి పూర్తిగా ఏం జరిగిందో తెలియకుండా అందరూ తనదే తప్పు అని మాట్లాడుతున్నారని ఈ వీడియో షేర్ చేసినట్లు అర్థం అవుతోంది. అది చూసిన వారంతా హార్దిక్ పాండ్యాతో విడాకుల గురించి పెట్టిందని అంటున్నారు.

Advertisement

Next Story