- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దాన్ని దృష్టిలో పెట్టుకునే అలాంటి డైలాగ్స్ రాస్తాను: సుకుమార్
దిశ, సినిమా: ఇటీవల కాలంలో సినిమా సక్సెస్‌లో సోషల్ మీడియా ముఖ్యపాత్ర పోషిస్తుందంటున్నాడు దర్శకుడు సుకుమార్. ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆయన.. ప్రస్తుతం తెరకెక్కిస్తున్న 'పుష్ప 2' గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు. 'నేను సినిమాలో డైలాగులు, పాటలు రాసేటపుడు అవన్నీ కూడా ఇన్‌స్టా, ట్విట్టర్, యూట్యూబ్ షార్ట్స్‌లో వస్తాయనే దృష్టితోనే మొదలుపెడతా. ఒక రచయిత రాసే డైలాగులు సోషల్ మీడియాలో అభిమానులను ఊహించనంతగా ప్రభావితం చేస్తాయి.
ఈ మధ్యకాలంలో చాలామంది రీల్స్, షార్ట్స్‌కు కనెక్ట్ అయ్యారు. 'పుష్ప' సినిమా విజయంలో ఇదొక భాగం కూడా. నెట్టింట ఆ సినిమా పాటలు, డైలాగ్స్ భారీ స్థాయిలో వైరల్ అయ్యాయి. రెండో పార్ట్‌లో కూడా ఇదే ప్లాన్ ఫాలో అవుతున్నా' అని వివరించాడు. ఇక ఈ సెకండ్ పార్ట్ షూటింగ్ శరవేగంగా జరుగుతోందని, కొన్ని యాక్షన్ సన్నివేశాలు పూర్తి చేసిన తర్వాత అప్‌డేట్ ఇస్తామని తెలిపాడు దర్శకుడు.