- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఈ సినిమా మీ లాంటి వాళ్ల కోసమే.. డైరెక్టర్ సుకుమార్‌కు సుధీర్ బాబు రిప్లై
దిశ, సినిమా: సుధీర్ బాబు అప్ కమింగ్ మూవీ ‘మా నాన్న సూపర్ హీరో’. ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని CAM ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి V సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన అప్‌డేట్స్ ఆకట్టుకోగా.. రీసెంట్‌గా రిలీజైన టీజర్‌కు విశేష స్పందన లభించింది. ఫాదర్ ఎమోషన్‌తో ఈ చిత్రం రాబోతోందని తెలుస్తుండగా.. తక్కువ డైలాగ్స్‌తో ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది టీజర్. ఇందులో సుధీర్ బాబు యాక్టింగ్ కూడా ఎంతో అద్భుతంగా కనిపించింది. దీంతో ఈ టీజర్‌కు సెలెబ్రిటీలు కూడా ఫిదా అయినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే సుధీర్ బాబుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇందులో భాగంగా తాజాగా ‘మా నాన్న సూపర్ హీరో’ టీజర్ చూసిన డైరెక్టర్ సుకుమార్ సుధీర్‌పై ప్రశంసలు కురిపించాడు. ఇందుకు సంబంధించిన వాట్సాప్ స్క్రీన్ షాట్స్‌ను సుధీర్ తన X ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఆ స్క్రీన్ షాట్స్‌లో.. సుకుమార్: సినిమాలోని సుధీర్ బాబు లుక్ షేర్ చేసి ‘ఈ ఎక్స్‌ప్రెషన్ సూపర్‌గా ఉంది. చాలా ఎక్స్‌ప్రెసీవ్‌గా ఉంది. నిన్ను ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది’ అని చెప్పుకొచ్చాడు. ఇక దీనికి సుదీర్ బాబు స్పందిస్తూ.. ‘ధన్యవాదాలు సార్. నాకు లభించిన అత్యుత్తమ అభినందనలు. మీ వాట్సాప్ డీపీలో మీ నాన్న గారు ఫొటో ఉంది. అది అతని పట్ల మీకున్న ప్రేమను చూపిస్తుంది. ఈ చిత్రం తన సూపర్ హీరోని ప్రేమించే మీలాంటి అబ్బాయి గురించి’ అని రిప్లై ఇచ్చాడు.
- Tags
- sukumar