- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Prabhas: ప్రభాస్‌తో నటించి పెద్ద తప్పు చేశా.. ఇంటర్వ్యూలో గుక్కపెట్టి ఏడ్చేసిన స్టార్ హీరోయిన్..?
దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ‘కల్కి’ భారీ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. అలాగే మరో 6 సినిమాలకు ఓకే చెప్పి బిజీ బిజీగా ఉన్నాడు. అయితే ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ "ఆదిపురుష్". ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. సూపర్ హిట్ అవుతుందని, సినిమాలో రామాయణం కథను చాలా అద్భుతంగా చూపిస్తారని ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ, అనుకున్నంత అంత అద్భుతంగా ఏం లేదు. అంతే కాకుండా ఇంత పెద్ద సినిమాను అంత చెత్తగా తీసినందుకు డైరెక్టర్‌ను బాగా విమర్శించారు. చాలామంది ఈ మూవీలో చూపించిన సన్నివేశాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వాటిని దారుణంగా ట్రోల్స్ చేశారు. అంతేకాకుండా ప్రభాస్ రాముడి పాత్ర వేశాడో లేదంటే వేరే పాత్ర వేశాడో అర్థం కావడం లేదంటూ బీభత్సంగా మీమ్స్ క్రియేట్ చేసి వదిలారు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి సనన్ ఆదిపురుష్ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ.. ఆది పురుష్ మూవీ ఫ్లాప్ అయిందని నేను చాలా బాధపడ్డాను.. కానీ, ఆ సినిమా కోసం మేము చాలా కష్టపడి పని చేశామని చెబుతూ బోరున ఏడ్చేసింది. కంటిన్యూ చేస్తూ.. ఈ మూవీ తర్వాత తనకు లాభం కంటే నష్టమే ఎక్కువగా జరిగినట్లు.. అదే విధంగా ఆదిపురుష్ సినిమా ఏ మతం వారిని అవమానించాలనే ఉద్దేశంతో రాలేదని ఆమె స్పష్టం చేసింది. కానీ, ప్రజలు అలా అనుకోవడంతో చాలా వివాదాలు వచ్చాయని ఈ అమ్మడు వెల్లడించింది. అయితే ఆ సినిమాలో ప్రభాస్‌తో కలిసి నటించి తప్పు చేశానని అర్థం వచ్చేలా ఆమె కామెంట్లు చేసిందని పలువురు అభిప్రాయపడుతుంటే.. మరికొందరు మాత్రం దాని గురించి ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం కృతి సనన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.