Hero Dhanush: ధనుష్ ‘రాయన్’ ట్రైలర్ అప్డేట్

by Prasanna |
Hero Dhanush: ధనుష్ ‘రాయన్’ ట్రైలర్ అప్డేట్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మనందరికీ సుపరిచితమే. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకెళ్తున్న ధనుష్ రాయన్ తో మన రాబోతున్నాడు. ఈ మూవీ తన సినీ కెరీర్‌లో 50వ సినిమా. ఎస్‌జే సూర్య, సందీప్ కిషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గ్యాంగ్ స్టార్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి ధనుష్ డైరెక్షన్ వహిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి రిలీజ్ అయినా టీజర్, సాంగ్స్ మంచి బజ్ క్రియోట్ చేసాయి. తాజాగా ఈ చిత్ర యూనిట్ మరో అదిరిపోయే అప్డేట్ అనౌన్స్ చేసారు.

ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘రాయన్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా ట్రైలర్ ను జూలై 16న విడుదల చేయనున్నారని పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మూవీ జూలై 26 న ఒకేసారి తమిళం, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. ఇది ధనుష్ కి చాలా ముఖ్యమైన సినిమా. ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో అని అటు ప్రేక్షకులుతో పాటు అభిమానుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు.


Advertisement

Next Story

Most Viewed