Big breaking: స్టార్ హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం.. మలైకా అరోరా తండ్రి ఆత్మహత్య

by Hamsa |   ( Updated:2024-09-11 14:37:55.0  )
Big breaking: స్టార్ హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం.. మలైకా అరోరా తండ్రి ఆత్మహత్య
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మలైకా అరోరా ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి అనిల్ అరోరా టెర్రస్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ముంబైలోని తన నివాసంలో ఇవాళ ఉదయం ఏడోవ అంతస్తు నుండి దూకి అనిల్ బలవన్మరణానికి పాల్పడటంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే అనిల్ అరోరా మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆయన ఏ విషయంలోనైనా మనస్థాపానికి గురై చనిపోయారా? లేక ఏదైనా జరిగిందా అనేది తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రజెంట్ అనిల్ కపూర్ ఆత్మహత్య ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది. దీంతో ఈ విషయం తెలుసుకున్న సినీ సెలబ్రిటీలు సంతాపం తెలుపుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed