- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గెలిచిన తన ఆస్కార్ అవార్డు భార్యకి అంకితం చేస్తూ.. ‘ఐరన్ మాన్’ డౌనీ ఎమోషనల్ స్పీచ్..
దిశ, సినిమా :‘ఐరన్ మ్యాన్’, ‘అవెంజర్స్’ లాంటి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్. 58 ఏళ్ళ ఈ సీనియర్ హీరో హాలీవుడ్ లో అత్యధిక పారితోషికం అందుకునే నటుల్లో ఒకరు. కానీ ఇంతవరకు ఆయన ఆస్కార్ అందుకోలేదు. కాగా మొత్తానికి డౌనీ కళ్ళ నెరవేరింది ఆస్కార్ ముచ్చట తీరింది.
తాజాగా లాస్ ఏంజిల్స్ లోని ప్రతిష్టాత్మక డాల్బీ థియేటర్ లో జరిగిన 96వ అకాడమీ అవార్డ్స్ వేడుకలో అంతా ఊహించినట్లుగానే ‘ఓపెన్ హైమర్’ చిత్రం 7 ఆస్కార్ అవార్డులు సాధించింది . ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు ఇలా కీలక విభాగాలన్నింటిలో ఈ మూవీ ఆస్కార్ అవార్డులు గెలుచుకుంది.
ఇందులో భాగంగా ‘ఓపెన్ హైమర్’ పుణ్యమా అని డౌనీకి కూడా ఆస్కార్ దక్కింది. ఈ చిత్రంలో లూయిస్ స్ట్రాస్ గా రాబర్ట్.. నెగిటివ్ పాత్రలో అద్భుతంగా నటించాడు. అతని బాడీ లాంగ్వేజ్ స్ట్రాస్ పాత్రకి బాగా సరిపోయింది. విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. అందుకే ఉత్తమ సహాయ నటుడిగా రాబర్ట్ డౌనీకి ఈ అవార్డు దక్కింది. కాగా ఈ అవార్డు అందుకున్న సమయంలో రాబర్ట్ ఎమోషనల్ అయ్యారు.. ‘ నాకు ఈ ఆస్కార్ వస్తుందని క్రిస్టఫర్ నోలెన్ ముందే ఊహించారు. నా జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి.. కానీ నా భార్య సుసాన్ డౌనీ సహకారంతోనే వాటిని అధికమించాను. అందుకే ఈ ఆస్కార్ అవార్డుని నా భార్యకి అంకితం ఇస్తున్న’ అంటూ డౌనీ ఎమోషనల్ అయ్యారు. ఇక రాబర్ట్ తొలిసారి ఆస్కార్ అందుకోవడంతో, ప్రపంచవ్యాప్తంగా అతని అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.
.