డేటింగ్ రూమర్స్.. ఆ హీరోయిన్‌తో జంటగా ఎంగేజ్‌మెంట్‌కు యంగ్ హీరో!

by Rajesh |   ( Updated:2023-01-27 03:02:06.0  )
డేటింగ్ రూమర్స్.. ఆ హీరోయిన్‌తో జంటగా ఎంగేజ్‌మెంట్‌కు యంగ్ హీరో!
X

దిశ, వెబ్ డెస్క్: గత కొన్ని రోజులుగా ఆ హీరోతో యంగ్ హీరోయిన్ డేటింగ్ లో ఉన్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ ఆ హీరో యంగ్ హీరో ఎంగేజ్ మెంట్ కు హాజరు కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ తో పాటు తమిళ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరో సిద్ధార్థ్. అయితే సముద్రం సినిమాలో హీరో శర్వానంద్ తో కలిసి మల్టీస్టారర్ లో నటించారు. ఇదే సినిమాలో హీరోయిన్ గా నటించిన అతిధి రావు హైదరితో సిద్ధార్థ్ డేటింగ్ లో ఉన్నాడని రూమర్స్ హాట్ టాపిక్ గా మారాయి.

అయితే నిన్న హీరో శర్వానంద్ ఎంగేజ్ మెంట్ రక్షితారెడ్డి అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌తో జరగింది. ఈ వేడుకకు హీరో సిద్ధార్థ్ హీరోయిన్ అతిధిరావుతో కలిసి హాజరు కావడంతో వీరిపై వస్తున్న రూమర్స్ నిజమనే టాక్ నడుస్తోంది. ఎంగేజ్ మెంట్‌లో వీరు శర్వానంద్ జంటతో దిగిన ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ విషయంపై సిద్ధార్థ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Also Read...

విధిని నిందించొద్దు.. వేగంగా వెళ్తే చస్తారని చెప్పండి: ఆర్జీవీ (వీడియో)

Advertisement

Next Story

Most Viewed