డేట్ లాక్ చేసుకున్న BIG BOSS సీజన్-8.. ఆసక్తిని రేకెత్తిస్తోన్న ఊహించని కంటెస్టెంట్లు?

by Anjali |
డేట్ లాక్ చేసుకున్న BIG BOSS సీజన్-8.. ఆసక్తిని రేకెత్తిస్తోన్న ఊహించని కంటెస్టెంట్లు?
X

దిశ, సినిమా: తెలుగు బిగ్‌బాస్ సీజన్-8 కోసం తెలుగు ప్రజలు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఎక్కడో హాలీవుడ్‌లో ప్రారంభమైన బిగ్‌బాస్ రియాల్టీ షో.. తర్వాత హిందీ, తెలుగు, కన్నడ వంటి భాషల్లో ప్రారంభమై సక్సెస్ అయ్యింది. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ నుంచైతే.. మంచి రెస్పాన్స్ లభించింది. ఇప్పటివరకు వచ్చిన సీజన్స్ అన్నీ మంచి రేటింగ్‌తో దూసుకుపోయాయి. విజయవంతంగా ఏడు సీజన్స్ కంప్లీట్ చేసుకున్న నాగార్జున ఇప్పుడు ఎనిమిదో సీజన్ ప్రారంభించబోతున్నారు. బిగ్ బాస్ సీజన్ - 8 మీద తెలుగు ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఈసారి నటసామ్రాట్ సరికొత్తగా షోను డిజైన్ చేశారట. జనాలకు కొత్త అనుభూతిని పంచేలా ఎలిమినేషన్స్, టాస్క్స్, రూల్స్, గేమ్స్ ఉండనున్నాయని నెట్టింట జనాలు తెగ చర్చించుకుంటున్నారు.

ఇక 50 రోజుల్లో బిగ్‌బాస్-8 స్టార్ట్ కాబోతుందట. ఈ ఏడాది సెప్టెంబరు 1 వ తేదీన ఆదివారం గ్రాండ్‌గా లాంట్ ఈవెంట్ జరగనుందని గట్టి టాక్ వినిపిస్తుంది. అయితే ఈ సీజన్‌లో ఊహించని కంటెస్టెంట్లు దిగనున్నారట. కుమారి ఆంటీ, బర్రెలక్క, యూట్యూబర్ బంచిక్ బబ్లూ, టాలీవుడ్ ప్రముఖ నటి సురేఖావాణి, నటి హేమ, సోనియా సింగ్, బుల్లెట్ భాస్కర్, కిరాక్ ఆర్పీ, రీతూ చౌదరి, సుందరరాజన్, అంబటి రాయుడు, అమృత ప్రణయ్, వర్షిణి, వేణుస్వామి హౌల్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారట. అంతా చిన్న స్థాయి నుంచి ఓ రేంజ్‌కు ఎదిగిన వ్యక్తులే కాబట్టి ఈ సీజన్‌పై జనాల్లో ఆసక్తి నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed