Chandramukhi 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు డేట్ ఫిక్స్..

by sudharani |   ( Updated:2023-09-20 12:36:36.0  )
Chandramukhi 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు డేట్ ఫిక్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: కొరియోగ్రాఫర్, యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్‌గా రానిస్తున్న రాఘవ లారెన్స్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘చంద్రముఖి-2’. పి. వాస్ దర్శకత్వం వహిస్తున్న ఈమూవీ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజైన ట్రైలర్.. మూవీపై ఎక్స్‌పెక్టేషన్స్‌ను భారీగా పెంచగా మరో అప్‌డేట్ ఇచ్చేశారు మేకర్స్. ఈ మేరకు సెప్టెంబర్ 24న ‘చంద్రముఖి-2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్ జె.ఆర్.సి. కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించబోతున్నట్లు తెలిపారు. కాగా.. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా రేంజ్‌లో ఈ మూవీ సెప్టెంబర్-28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Advertisement

Next Story