‘డార్లింగ్’ ట్రైలర్ రిలీజ్.. జంటగా నభా, ప్రియదర్శి యాక్టింగ్ అదుర్స్

by Hamsa |
‘డార్లింగ్’ ట్రైలర్ రిలీజ్.. జంటగా నభా, ప్రియదర్శి యాక్టింగ్ అదుర్స్
X

దిశ, సినిమా: నభా నటేష్, ప్రియదర్శి జంటగా నటించిన తాజా చిత్రం ‘డార్లింగ్’. ఈ సినిమాను డైరెక్టర్ అశ్విన్ రామ్ తెరకెక్కించాడు. అయితే ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. తాజాగా, డార్లింగ్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. అందులో నభా, ప్రియదర్శి భార్యభర్తలుగా అందరినీ ఆకట్టుకుంటున్నారు. నభా నటేష్ భార్యగా భర్తకు చుక్కలు చూపిస్తుంది. దీంతో డాక్టర్ దగ్గరకు వెళ్తే ఆమెకు ఏదో డిజార్డర్ ఉండటం వల్ల అలా చేస్తుందని చెప్పడంతో ప్రియదర్శి నిజమే అనుకుంటాడు. ఫుల్ కామెడీతో పాటు ఎమోషన్స్‌తో నెట్టింట డార్లింగ్ ట్రైలర్ అందరిని ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమా జూలై 19న థియేటర్స్‌లో విడుదల కాబోతుండటంతో నభా నటేష్, ప్రియదర్శి ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు.


Advertisement

Next Story

Most Viewed