విజయ్‌ దేవరకొండతో వివాదం.. తొలిసారి అనసూయ హాట్ కామెంట్స్

by Sathputhe Rajesh |   ( Updated:2023-06-09 10:18:38.0  )
విజయ్‌ దేవరకొండతో వివాదం.. తొలిసారి అనసూయ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: హీరో విజయ్ దేవరకొండ, అనసూయ మధ్య గత కొన్ని రోజులుగా కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు విజయ్‌కి అనసూయ సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇస్తూ వస్తున్నారు. అయితే ఇదే విషయమై అనసూయ తాజాగా ఓ ఇంగ్లీష్ న్యూస్ పేపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హాట్ కామెంట్స్ చేశారు. విజయ్ దేవరకొండ తనకు ఎంతో కాలం నుంచి పరిచయం అన్నారు. మేమిద్దరం గుడ్ ఫ్రెండ్స్. అర్జున్ రెడ్డి సినిమాలో కొన్ని బూతులను మ్యూట్ చేసిన విషయం తెలిసిందే. అయితే సినిమా విడుదల సందర్భంగా విజయ్ దేవరకొండ అభిమానులతో ఆ పదాలను పలికించడం ఓ తల్లిగా నన్ను బాధించిందని అనసూయ అన్నారు.

ఇలాంటి సరికాదని విజయ్‌తో చెప్పాను. ఆ తర్వాతే తనపై ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. విజయ్ దేవరకొండ నిర్మించిన ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాలో నటించాను. అయితే విజయ్ దగ్గరి వ్యక్తి తనపై ట్రోల్ చేయడం కోసం డబ్బులు ఇస్తున్నాడని తెలిసి షాక్ కు గురయ్యాను. విజయ్ కు తెలియకుండానే ఇది జరుగుతోందా అనిపించింది. విజయ్ నన్ను ద్వేషిస్తున్నాడో లేదో తెలియదని.. కానీ ఇక్కడితో ఈ వివాదాన్ని ఆపేయాలని డిసైడ్ అయ్యాను. జీవితంలో ముందుకు సాగిపోవాలని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే నాకు మానసిక ప్రశాంతత కావాలి అని అనసూయ అన్నారు. ఇటీవల అనసూయ ఖుషి పోస్టర్ పై ది విజయ్ దేవరకొండ ఉండటాన్ని తప్పుబడుతూ వరుస ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే. లైగర్ సినిమాపై కూడా అనసూయ వ్యంగ్యంగా ట్వీట్లు చేసి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే. మరి అనసూయ తాజా కామెంట్స్ తో విజయ్ వర్సెస్ అనసూయ గొడవకు ఫుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి..

Also Read; ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే మలయాళం మరియు తమిళ సినిమాలు ఇవే..

Advertisement

Next Story