అడ్డంకులు సృష్టించినా.. సునామీలా దూసుకెళ్లిన పవర్ స్టార్ 'BRO'

by sudharani |   ( Updated:2023-08-04 15:19:23.0  )
అడ్డంకులు సృష్టించినా.. సునామీలా దూసుకెళ్లిన పవర్ స్టార్ BRO
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా సినిమా ‘బ్రో’. తమిళ దర్శకుడు సముద్రఖని రూపొందించిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ సంపాదించుకున్నప్పటికీ కలెక్షన్లో మాత్రం దూసుకుపోతుంది. ఇక విడుదలై వారం రోజులు గడుస్తున్న క్రమంలో ప్రపంచవ్యాప్తంగా రూ. 122.96 కోట్లు రాబట్టి సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే నిన్న మాత్రం కలెక్షన్లు కాస్త తగ్గుముఖం పట్టడంతో కేవలం 4.23 కోట్లు మాత్రమే వచ్చాయట. కాగా.. రేపు వీకెండ్ కావడంతో ఈ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాలు తెలుపుతున్నాయి. అయితే.. రీమేక్ సినిమాలతో వందల కోట్లు కొల్లగొట్టిన ఘనత పవన్ కళ్యాణ్‌కే దక్కుతుందని అభిమానులు ఆకాశానికి ఎత్తుతున్నారు.

Advertisement

Next Story