- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇది గమ్మత్తయిన వ్యాపారం.. హిట్ ఫ్లాప్ కామన్: Chunky Panday
దిశ, సినిమా : కూతురు అనన్య పాండే నటించిన 'లైగర్' ఫెయిల్యూర్‌పై చంకీ పాండే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలై అట్టర్ ఫ్లాప్ అయింది. పెద్ద ఎత్తున్న విమర్శలు అందుకుంది. కాగా ఈ ఇష్యూపై తాజాగా స్పందించిన ఆయన.. 'ఇలాంటి అనుభవాన్ని ఎన్నో చిత్రాలు ఎదుర్కొన్నాయి. నటీనటులు ఎవరైనా తన సినిమాకు నటనా పరంగా 100 శాతం న్యాయం చేస్తారు. సాధ్యమైనంతగా ప్రమోట్ చేస్తారు. అయితే కొన్నిసార్లు జీవితంలో కొన్ని తప్పులు జరిగినట్లే సినిమాల్లోనూ చోటుచేసుకుంటాయి. దీంతో నటీనటులే విధ్వంసానికి గురవుతారు. అయినప్పటికీ ఎల్లప్పుడూ సినిమాతోనే జీవించాలి. దానితోనే ముందుకు సాగాలి. ఇదొక గమ్మత్తైన వ్యాపారం. అనన్యకు దీని గురించి తెలుసని భావిస్తున్నా. ఈ వ్యాపారంలో దేన్ని తక్కువగా లేదా అతిగా అంచనా వేయకూడదు' అని వివరించాడు. చివరగా దాదాపు ఒక చిత్రానికి 400 మంది పనిచేసినప్పటికీ అది ఫెయిల్ అయితే కేవలం హీరోహీరోయిన్లు, దర్శకనిర్మాతలే విమర్శలు ఎదుర్కోవాల్సి రావడం కాస్త ఇబ్బందిగానే ఉంటుందనడం విశేషం.
ఇవి కూడా చదవండి : పని కోసం దర్శకుల ఫోన్ నంబర్లు సేకరించేవాడిని: Sharman Joshi