పీరియడ్స్ గురించి మహిళలు ధైర్యంగా మాట్లాడాలి: మెగా స్టార్ కూతురు

by sudharani |   ( Updated:2023-12-17 16:34:17.0  )
పీరియడ్స్ గురించి మహిళలు ధైర్యంగా మాట్లాడాలి: మెగా స్టార్ కూతురు
X

దిశ, సినిమా : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత.. మహిళలు పీరియడ్స్ విషయంలో అస్సలు సిగ్గుపడకూడదంటోంది. పీరియడ్స్‌పై అవగాహన కల్పించేందుకు 'పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్(PURE)' అనే సంస్థ 'ప్యూరథాన్-2022'లో భాగంగా 'పీరియడ్ పావర్టీ రన్ ఈవెంట్'గా అక్టోబర్ 9న ఉదయం 6.30 గంటలకు నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించనున్నారు. ఈ క్రమంలో కర్టెన్ రైజర్‌లో భాగంగా పోస్టర్ విడుదల చేసిన సుస్మిత.. పీరియడ్స్ గురించి మహిళలు ధైర్యంగా మాట్లాడాలని కోరింది.

'ఇలాంటి కార్యక్రమంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. పీరియడ్స్ అనేవి మహిళల శరీర అభివృద్ధికి ఉపయోగపడతాయి. కాబట్టి వాటి గురించి అవగాహన కల్పించడానికి ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అది గుర్తొచ్చినప్పుడల్లా బాధగా అనిపిస్తుంది. ఇప్పటికీ పీరియడ్స్ గురించి మాట్లాడటానికి చాలా కుటుంబాల్లో మహిళలు ఇబ్బంది పడతారు. దీనిపై సరైన అవగాహన లేకపోవడం వల్ల ఎంతోమంది శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భవిష్యత్తులో ఎంతోమంది అమ్మాయిలు భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తారు. అలాంటి వారి కోసం ఇలాంటి అపోహలను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఇలాంటి మంచి విషయానికి సపోర్టు చేస్తూ.. అపోహలను తొలగించడానికి మగవాళ్లు కూడా రావడం గొప్ప విషయం' అంటూ ప్రశంసించింది.

ఇవి కూడా చ‌ద‌వండి :

కండోమ్స్ కూడా అడుగుతారన్న ఐఏఎస్ అధికారిణి.. సీఎం రియాక్షన్ ఇదే.

Advertisement

Next Story

Most Viewed