‘భోళా శంకర్’ లో శ్రీముఖితో ఆ సీన్ (వీడియో).. రజినీ కాంత్‌ను చూసి నేర్చుకోమంటున్న నెటిజన్లు

by Hamsa |
‘భోళా శంకర్’ లో శ్రీముఖితో ఆ సీన్ (వీడియో).. రజినీ కాంత్‌ను చూసి నేర్చుకోమంటున్న నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా నటించిన చిత్రం ‘భోళా శంకర్’. ఇందులో కీర్తి సురేష్, సుశాంత్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా గ్రాండ్‌గా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో చిరంజీవి, యాంకర్ శ్రీముఖి మధ్య చోటుచేసుకున్న ఖుషీ సీన్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి. పవన్ కల్యాణ్, భూమిక నడుము సీన్ సెట్ అయిందని కానీ, శ్రీముఖి, చిరంజీవి మధ్య ఆ సీన్ చండాలంగా ఉందని నెటిజన్లు ఫుల్ ఫైర్ అవుతున్నారు. అంతేకాకుండా దారుణంగా చిరును ట్రోల్ చేస్తున్నారు. ఆయన స్థాయి ఏంటి.. ఆ సీన్ లేంటి.. ఈ వయసులో ఇలాంటి పనులేంటి అంటూ ఆడేసుకుంటున్నారు. భోళా శంకర్ కంటే ముందు వచ్చిన జైలర్ చూసిన వారంతా ఆయనను చూసి అయినా నేర్చుకోవాలంటే సలహాలు ఇస్తున్నారు. ఇలాంటి సినిమాలకు టికెట్ల రేట్ల పెంపు, ప్రీ రిలీజ్ ఫంక్షన్లు విచిత్రంగా చిరు పేరుతో లీకులు ఇవన్నీ అవసరమా అంటూ మండిపడుతున్నారు.

Read More:

‘గేమ్ ఛేంజర్’ సినిమాలో ఏడు పాత్రల్లో కనిపించబోతున్న రామ్ చరణ్..?

‘భోళా శంకర్’ పర్‌ఫెక్ట్ రివ్యూ.. (వీడియో)

Advertisement

Next Story

Most Viewed