- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నాతో ఓనమాలు దిద్దించిన మహానుభావుడు ఆయనే: Chiranjeevi
X
దిశ, సినిమా: ప్రముఖ దివంగత దర్శకుడు కె. విశ్వనాథ్ వ్యక్తత్వం గురించి నటుడు చిరంజీవి ప్రసంశలు కురిపించాడు. సోమవారం ఆయన జయంతి సందర్భంగా 'కళాతపస్వికి కళాంజలి' అనే కార్యక్రమంలో మాట్లడిన చిరు.. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. 'ఇది విశ్వనాథ్ గారి సంతాప సభలా ఉండకూడదు. ఓ పండగలా ఉండాలి. ఆయనను నేను మూడు కోణాల్లో చూస్తా.
మూడు చిత్రాల్లో అవకాశం ఇచ్చిన దర్శకుడిగా, అనుక్షణం నా నటనను సరిదిద్దిన గురువుగా, చిత్రీకరణ సమయంలో చూపించిన ప్రేమలో తండ్రిగా భావిస్తా. డైలాగ్‌లు చెప్పడంలో నాతో ఓనమాలు దిద్దించిన మహానుభావుడు. నేను క్లాసికల్ సినిమాలు చేయగలననే నమ్మకంతో 'స్వయం కృషి' కథ చేయించాడు. అలా సున్నితంగా నటించడం ఆయన దగ్గరే నేర్చుకున్నా. మా కలయికలో వచ్చిన అపూరూప చిత్రం 'ఆపద్బాంధవుడు'' అంటూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు చిరు.
Advertisement
Next Story