- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
రష్మిక ఫేక్ వీడియోలపై చిన్మయి వైరల్ పోస్ట్
దిశ, సినిమా: రీసెంట్‌గా రష్మిక మందన్నకు సంబంధించిన ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఆమె కూడా స్పందించగా.. అమితాబ్ బచ్చన్‌తో సహా ఇండస్ట్రీలో పలువురు సెలబ్రిటీలు మద్దతుగా నిలిచారు. అలాంటి వారిని శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. ఇక ఇదే ఇష్యూ మీద సింగర్ చిన్మయి గళమెత్తింది. తన ట్విట్టర్‌లో దీనిపై గట్టిగా స్పందించిది.
‘చాలా రోజుల క్రితం ఇలానే సిమ్రన్ మీద ‘కావాలయ్యా’ సాంగ్ ఏఐ వీడియో వచ్చింది. కానీ అందులో ఉన్నది ఆమె కాదు. అది డీప్ ఫేక్. ఈ పాటకు ఆమె అనుమతి తీసుకునే ఆ వీడియో ఎడిట్ చేశారా? లేదా? అన్నది తెలియదు. కానీ ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఆ వీడియోను షేర్ చేసింది. అలా సరదాగా తీస్తే ఏం తప్పులేదు. కానీ ఇదేంటి? రష్మిక ఇన్‌స్టా స్టోరీ చూస్తే నాకు చాలా బాధగా అనిపించింది. మన దేశంలో ఆడవాళ్ల శరీరాలను ఎప్పుడూ ఇలాంటి కోణంలోనే చూస్తారు. ఇక ఇదే భవిష్యత్తులో అతి పెద్ద ఆయుధంగా మారుతుంది. వేధింపులు, రేప్‌లు, బ్లాక్ మెయిల్‌లు జరుగుతాయి. ఇంకా చిన్న చిన్న గ్రామాల్లో వీటిపై అవగాహన ఉండదు. అర్థం చేసుకునే తెలివి కూడా ఉండదు. పరువుపోయిందని గుండెలు బాదుకుంటారు. నిజంగా డీప్ ఫేక్ అనేది భయంకరంగా మారనుంది. ప్రతీ ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. అలాగే దేశవ్యాప్తంగా వీటిపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. ఇలాంటివి జరుగుతున్నాయని తెలిస్తే వెంటనే భయపడకుండా అందరూ ఫిర్యాదు చేయాలి’ అని కోరింది చిన్మయి.