పెళ్లి కాకముందే తల్లి అవుతున్న Charmy !

by samatah |   ( Updated:2022-12-31 04:36:50.0  )
పెళ్లి కాకముందే తల్లి అవుతున్న Charmy !
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో చార్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం నటనతో ఎంతో మంది అభిమానులను కూడగట్టుకుంది ఈముద్దుగుమ్మ. ఇక ఈ అమ్మడు గత కొన్ని రోజుల నుంచి సినిమాలు వదిలేసి, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇక పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ సినిమాకు చార్మీ నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాతో హీరోయిన్ చాలా నష్టపోయింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు సోషల్ మీడియాలో చార్మీకి సంబంధించిన ఏదో ఒక న్యూస్ తెగ వైరల్ అవుతోంది.

తాజాగా చార్మీకి సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ అందాల భామ పెళ్లికాక ముందే తల్లి కాబోతుందంట. అయితే ఇది రియల్ లైఫ్‌లో కాదండోయ్.. రీల్ లైఫ్‌లో, చార్మీ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోయిన్ లకి మదర్ క్యారెక్టర్ లో నటించాలని సిద్ధపడినట్లు ఓ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇక దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

Also Read..

నానితో రొమాన్స్ చేయనున్న " సీతారామమ్ " ముద్దుగుమ్మ

Advertisement

Next Story