Chandramukhi-2 రన్ టైమ్ ఫిక్స్.. బాబోయ్ అన్ని గంటలా..!

by Shiva |   ( Updated:2023-09-15 15:38:22.0  )
Chandramukhi-2 రన్ టైమ్ ఫిక్స్.. బాబోయ్ అన్ని గంటలా..!
X

దిశ, వెబ్ డెస్క్ : దర్శకుడు పీ.వాసు, ప్రముఖ కొరియోగ్రాఫర్, హీరో రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ చంద్రముఖి-2. ఈ పవర్ ప్యాక్ మూవీని లైకా ప్రోడక్షన్ నిర్మిస్తుండగా, ఎం.ఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 28న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కానీ, సినిమా నిడివి గురించే ప్రస్తుతం సర్వత్రా చర్చ జరుగుతోంది. మూవీ నిడివి దాదాపు 170 నిమిషాలకు ఫిక్స్ చేశారట. అంటే.. దాదాపు 2 గంటల 50 నిమిషాలు. అంత పెద్ద రన్ టైమ్ ఉన్న సినిమాలో కంటెంట్, ఆర్ట్ వర్క్, సీజీ వర్క్ అద్భుతంగా ఉంటేనే మూవీ బ్లాక్ బస్టర్ అవుతుందని, లేని పక్షంలో డిజాస్టర్ గా మిగిలిన సినిమాలు చాలా ఉన్నాయని సినీ విమర్శకులు కామెంట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : ‘మాయే చేసి’.. ఆకట్టుకుంటున్న ‘డెవిల్’ ఫస్ట్ సింగిల్ ప్రోమో

Advertisement

Next Story