43వ పడిలోకి అడుగుపెట్టిన విజయ్.. స్పెషల్ నోట్ షేర్ చేసిన స్టార్ డైరెక్టర్స్

by Disha daily Web Desk |
43వ పడిలోకి అడుగుపెట్టిన విజయ్.. స్పెషల్ నోట్ షేర్ చేసిన స్టార్ డైరెక్టర్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి 43వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సేతుపతికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలోనే దర్శకుడు గోపీచంద్ 'డియర్ విజయ్‌సేతు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు' సందేశంతోపాటు తనకు సంబంధించిన ఓ వీడియోను పంచుకోగా.. సేతుపతికి హృదయపూర్వక పుట్టినరోజు నోట్ రాసిన విఘ్నేష్ శివన్ 'హ్యాపీ బర్త్ డే విజయ్‌సేతు ఆఫ్ మక్కల్ సెల్వన్ !!! లవ్ యు ఎ లాట్. ఎల్లప్పుడూ మీ షరతులు లేని ప్రేమకు, విశ్వాసానికి ధన్యవాదాలు! సిరంధ నడిగన్!!! మిగసిరంధ మనిధన్' అంటూ తనదైన స్టైల్‌లో విష్ చేశాడు. 'సైరా నరసింహా రెడ్డి', 'ఉప్పెన' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన విజయ్.. నటుడు మాత్రమే కాదు నిర్మాత, మాటలు, సంభాషణల రచయిత అనే విషయం చాలా మందికి తెలియదు.

Advertisement

Next Story

Most Viewed