- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ బ్యాండ్స్ ధరించి అనంత్ అంబానీ పెళ్లికి హాజరైన సెలబ్రిటీలు..అసలు వాటి రహస్యం తెలుసా?
దిశ, సినిమా : అపర కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు, అనంత్ అంబానీ పెళ్లి ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. వీరి వివాహ వేడుకకు ఎంతో మంది నటీనటులు, బిజినెస్ మ్యాన్స్, రాజకీయ నాయకులు, పలువురు హాజరు అయ్యారు.
ముఖ్యంగా అంబానీ పెళ్లి వేడుకల్లో సినీ తారలు చేసిన సందడి గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. వారు తమ ఆట, పాటలతో ఎంతో ఉత్సాహంగా అనంత్ అంబానీ వివాహ వేడుకలో పాల్గొన్నారు. అయితే వివాహం, శుభ ఆశీర్వాద్ వేడుకలకు దాదాపు 2000ల మంది అతిథులు హాజరు కాగా, రిసెప్షన్‌కు మాత్రం సుమారు 14000 ల మంది హాజరైనట్లు తెలుస్తోంది. కాగా, వీరి భద్రత దృష్ట్యా అంబానీ వీరి కోసం స్పెషల్ కేర్ తీసుకున్నారంట. అతిథులకు వారి పర్సనల్ మొబైల్ ఫోన్‌లకు క్యూఆర్ కోడ్ పంపించారంట. దాని ద్వారా గెస్ట్‌లు అందరూ వివాహా వేడుకలోకి ఎంట్రీ ఇచ్చారు. అంతే కాకుండా, వారికి యాక్సెస్ కోసం వివిధ రంగుల కోడెడ్ పేపర్ రిస్ట్ బ్యాండ్స్ కూడా ఏర్పాటు చేయించారు. ముఖ్య అతిథులకు ఒక రంగు, క్రీడా రంగం వారికి ఒక రంగు, సెక్యూరిటీ, ఉద్యోగులకు ఒక రంగును కేటాయించారు. అలా వివిధ రంగుల బ్యాండ్స్ ధరించి సెలబ్రిటీలు వివాహానికి హాజరు అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Video credit to manav manglani instagram channel