పీరియడ్స్‌తో ఉన్న మహిళలు ఆదిపురుష్ మూవీ చూడొచ్చా?

by Anjali |   ( Updated:2023-06-11 10:16:03.0  )
పీరియడ్స్‌తో ఉన్న మహిళలు ఆదిపురుష్ మూవీ చూడొచ్చా?
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆదిపురుష్’. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది భక్తి పేరుతో ప్రమోషనల్ స్ట్రాటజీ ఉపయోగిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల తిరుపతిలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అంచనాలు తారాస్థాయికి తీసుకెళ్ళగా.. దర్శకుడు, హీరోయిన్ కృతి సనన్‌కు తిరుమల కొండపై కిస్సులు, హగ్గుల వ్యవహారంతో ఈ చిత్రంపై పాజిటివ్ ఒపినియన్ కాస్త నెగిటివ్‌గా మారింది. అయితే ఈ సినిమా థియేటర్‌ను ఒక గుడిలా భావించాలని, అలాగే హనుమంతుడి కోసం ఒక సీటు వదిలి పెట్టాలని సూచించిన సంగతి తెలిసిందే. మూఢనమ్మకాలపై విరుచుకుపడే బాబు గోగినేని తాజాగా.. ఈ చిత్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘‘సినిమా హాల్‌ను గుడిలా మార్చేస్తున్నారు కదా. దీనికి మీకు పర్మిషన్ ఉందా? మూవీ చూడడానికి వచ్చిన వారికి కొబ్బరికాయలు కొట్టే సదుపాయం కూడా ఏర్పాటు చేస్తారా? అలాగే థియేటర్ వద్దకు ఒక పురోహితుడిని, ఆవుని తీసుకురండి. ఒక హుండీ కూడా పెట్టండి. మరీ రాహుకాలంలో మూవీ ప్రసారమైతే పరిస్థితి ఏంటి? గుడిలా భావించే ఈ సినిమా థియేటర్‌లోకి పీరియడ్స్‌తో ఉన్న మహిళలు అడుగు పెట్టొచ్చా మరీ?’’ అంటూ దారుణంగా సెటైర్లు వేస్తూ మాట్లాడారు. ప్రస్తుతం బాబు గోగినేని సినిమా పట్ల చేసినటువంటి ఈ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి:

ప్రభాస్‌తోనే నా పెళ్లి.. స్వయంగా ప్రకటించిన యాంకర్ శ్రీముఖి

వరుణ్ తేజ్.. లావణ్యకు తొడిగిన రింగ్ ఖరీదెంతో తెలుసా?

వరుణ్ ఎంగేజ్మెంట్‌.. నిహారికను తలుచుకుని నాగబాబు ఎమోషన్ ట్వీట్ వైరల్

Advertisement

Next Story