ShahRukh Khan: మహాత్మా గాంధీ తర్వాత ఆ గౌరవాన్ని పొందిన రెండవ భారీతీయుడుగా స్టార్ హీరో..

by sudharani |
ShahRukh Khan: మహాత్మా గాంధీ తర్వాత ఆ గౌరవాన్ని పొందిన రెండవ భారీతీయుడుగా స్టార్ హీరో..
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ప్రజెంట్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. జవాన్, పఠాన్, డంకీ వంటి చిత్రాలతో భారీ హిట్ అందుకున్న ఈయన.. ప్రస్తుతం సుజయ్ ఘోష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అంతే కాకుండా ఈ చిత్రంలో షారుఖ్ కూతురు సహానా ఖాన్ ఓ కీలక పాత్రలో నటించనుందని తెలుస్తుండగా.. దీనికి ‘కింగ్’ అనే టైటిల్ పెడుతున్నట్లు బాలీవుడ్ సర్కిల్‌లో టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే.. బాలీవుడ్ బాద్‌షాకు తాజాగా అరుదైన గౌరవం దక్కింది.

ప్యారిస్‌లోని ప్రసిద్ధ గ్రావిన్ మ్యూజియంలో చాలా మంది ప్రముఖుల మైనపు విగ్రాహాలు ఉన్నాయి. వీటిలో స్టార్ హీరో షారుఖ్ ఖాన్ బొమ్మ కూడా ఉంది. అయితే.. తాజాగా ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లోని గ్రావిన్ మ్యూజియం షారుఖ్ ఖాన్‌ను బంగారు నాణెంతో సత్కరించింది. అంతే కాకుండా పారిస్‌కు చెందిన గ్రెవిన్ గ్లాస్ రిలీజ్ చేసిన నాణెంపై షారుఖ్ ఫొటోతో పాటు పేరు ఉండటం విశేషం. కాగా.. మహాత్మా గాంధీ తర్వాత ఈ గౌరవాన్ని అందుకున్న రెండవ భారతీయుడుగా బాద్‌షా నిలిచాడు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో.. అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.



Next Story