బిగ్‌బాస్ షోలో ఘోరం.. చుట్టూ కెమెరాలు ఉన్నా అసభ్యంగా ప్రవర్తించిన కంటెస్టెంట్

by Anjali |   ( Updated:2023-06-27 09:34:02.0  )
బిగ్‌బాస్ షోలో ఘోరం.. చుట్టూ కెమెరాలు ఉన్నా అసభ్యంగా ప్రవర్తించిన కంటెస్టెంట్
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ షో వివాదాలకు, వికృత చేష్టలకు అడ్డాగా మారుతోంది. అంత పెద్ద హౌస్‌లో లైవ్ కెమెరాలు ఉండగా, పైగా ఫ్యామిలీతో చూసే ప్రోగ్రామ్ అని కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు. కొంతమంది కంటెస్టెంట్స్ చేస్తున్న పనులు చూసేవారికి చిరాకు తెప్పిస్తున్నాయి. అయితే తాజాగా బాలీవుడ్‌లో బిగ్ బాస్ ఓటీటీ సీజన్-2 నడుస్తోంది. జియోలో ప్రసారమవుతున్న ఈ షోలో బాలీవుడ్ నటుడు జాద్ హదీద్.. ఇదే హౌస్‌లో మరో కంటెస్టెంట్ దుబాయ్‌కు చెందిన మోడల్ ఆకాంక్ష పూరితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. జనాలు అంతమంది చూస్తున్నారని ఆలోచన లేకుండా తన వెనకాల పడుతూ.. ఆమెను టచ్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ షో ప్రారంభమైనప్పటి నుంచి అతడు ఆకాంక్ష పట్ల ప్రవర్తన తేడాగానే ఉంది. తాజాగా ఆమె నడుము పట్టుకుని దగ్గరకు లాక్కోవడానికి ట్రై చేశాడు. ఆమె ఇబ్బంది పడుతూ అతడికి దూరంగా జరగడానికి ప్రయత్నిస్తోన్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇంత మంది చూస్తున్న షోలో అతను ఇలా చేయడం అస్సలు పద్ధతి కాదంటూ జాద్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు.

Click Here for Instagram post

Advertisement

Next Story

Most Viewed