- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రియుడితో కలిసి అమెరికా షిఫ్ట్ అవుతోన్న బిగ్‌బాస్ బ్యూటీ
దిశ, సినిమా: మా టీవీలో ప్రసారమయ్యే మౌనరాగం సీరియల్‌తో ప్రేక్షకులకు దగ్గరైంది ప్రియాంక జైన్. సీరియల్స్‌లో రాణించిన ఈ ముద్దుగుమ్మ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన తెలుగు బిగ్‌బాస్ సీజన్-7 లో కంటెస్టెంట్‌గా హౌస్‌లో అడుగుపెట్టింది. టాప్ 6 కంటెస్టెంట్‌గా నిలిచి.. లేడీ టైగర్‌గా పేరు దక్కించుకుంది. ప్రియాంక హౌస్‌లోనే తన ప్రేమ కథను బయటపెట్టింది.‘‘మరో సీరియల్ నటుడు శివ్ కుమార్‌ను లవ్ చేస్తున్నాని.. మేమిద్దరం చాలా కాలంగా ప్రేమలో ఉన్నామని’’ తెలిపింది.
శివ్ కుమార్ కూడా బిగ్‌బాస్‌కు రావడం.. ప్రియాంక హగ్ చేసుకోవడం.. ప్రియాంక ఎమోషనల్ అవుతూ మనం ఇప్పుడే పెళ్లి చేసుకుందాం అనడం.. అన్ని చూసే ఉంటారు. ఈ లవ్ బర్డ్స్ ముద్దులతో రెచ్చిపోతూ బిగ్ బాస్ హౌస్‌ను రొమాంటిక్ హాబ్‌గా మార్చేశారు. హౌస్ నుంచి రాగానే వీరు పెళ్లిపీటలెక్కుతారని అందరూ భావించారు. కానీ పెళ్లి ప్రస్తావన ఇప్పటివరకు రాలేదు. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ సడెన్ ట్విస్ట్ ఇచ్చింది. శివ్ కుమార్‌తో కలిసి అమెరికా వెళ్తున్నట్లు ప్రియాంక తన యూట్యూబ్ ఛానల్లో తెలిపింది.