Bigg Boss: బిగ్ బాస్ పేరిట లక్షల్లో మోసం..! సంచలన నిజాలు బయటపెట్టిన ఆదిరెడ్డి (వీడియో)

by Kavitha |   ( Updated:2024-08-04 02:31:18.0  )
Bigg Boss: బిగ్ బాస్ పేరిట లక్షల్లో మోసం..! సంచలన నిజాలు బయటపెట్టిన ఆదిరెడ్డి (వీడియో)
X

దిశ, సినిమా: ఒక బిగ్ బాస్ రివ్యూవర్‌గా కెరీర్ ప్రారంభించి.. అదే బిగ్ బాస్ షోకి వెళ్లి తన సత్తా చాటిన ఆదిరెడ్డి గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. బిగ్‌బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాడు. అలా అక్కడ తన గేమ్స్‌తో టాప్ 5 కంటెస్టెంట్‌గా నిలిచి ఆడియన్స్‌లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. కానీ, విన్నర్ మాత్రం కాలేకపోయాడు. ఇక బయటికి వచ్చిన తర్వాత కూడా తన రివ్యూవర్ రోల్‌ని సక్సెస్ ఫుల్‌గా కొనసాగిస్తున్నాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7కి సంబంధించి వరుస వీడియోలు, అనాల్సిస్‌తో తన ఫాలోవర్స్‌ని అలరించాడు. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 వీడియోలు కూడా మొదలు పెట్టాడు. అందులో భాగంగా ఆదిరెడ్డి కొన్ని కీలక విషయాలను ఒక వీడియోగా చేసి పోస్ట్ చేశాడు. అందులో భాగంగా బిగ్ బాస్ పేరిట జరిగే మోసాల గురించి కూడా చెప్పుకొచ్చాడు. ఎవరూ కూడా అలాంటి ట్రాప్‌లో పడొద్దు అంటూ సూచించాడు.

ఆ వీడియోలో.. తనకు బిగ్ బాస్‌కి సంబంధించిన ఒక వ్యక్తి ఫోన్ చేసి.. మీకు బిగ్ బాస్‌కి రావడానికి ఆసక్తి ఉందా అని అడిగారంట. తనకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పిన తర్వాత అధికారిక వెబ్ సైట్ నుంచి మెయిల్ పంపి కొన్ని వివరాలు తెలిపారు. ఆ తర్వాత అతనికి జూమ్ కాల్ ద్వారా ఇంటర్వ్యూ జరిగిన విషయాన్ని చెప్పాడు. తర్వాత రెమ్యూనరేషన్ వివరాలు చర్చించడం, హెల్త్ చెకప్స్, తర్వాత మెయిన్ ఇంటర్వ్యూ కూడా జరిగిందంట. ఏవీలు, డ్యాన్స్ షూట్స్ అన్నీ అయిన తర్వాత హౌస్‌లోకి పంపుతారు. అలాగే రికమెండేషన్‌తో బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లడం అసాధ్యం అనే విషయాన్ని స్పష్టం చేశాడు. అలాగే ఎవరైనా మీకు బిగ్ బాస్ హౌస్‌కి పంపుతాను అని డబ్బులు అడిగినా కూడా ఆ ట్రాప్‌లో పడకండి అని సూచించాడు. ఆఫర్ ఇచ్చే పనైతే వాళ్లే కాల్ చేసి.. అధికారిక మెయిల్ ఐడీ నుంచి మెయిల్ చేస్తారని చెప్పుకొచ్చాడు. కాగా తనకు బిగ్ బాస్ సీజన్ 6 ద్వారా రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు రెమ్యునరేషన్ అందినట్లు ఆదిరెడ్డి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుంది.

ఇక రీసెంట్‌గానే బిగ్‌బాస్ సీజన్ 8కి సంబంధించి ప్రోమో రిలీజ్ చేసి.. అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం అంటూ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.. ఆ ప్రోమోను బట్టి చూస్తే.. ఈసారి కూడా దాదాపుగా సెప్టెంబర్ నెలలోనే స్టార్ట్ అవుతుంది అనే విషయం అయితే అర్థమవుతోంది.

(video link credits to adi reddy youtube channel)

Advertisement

Next Story

Most Viewed