ప్రియుడు చేసిన పని వల్ల ఏడుస్తూ గోవా రోడ్లపై తిరుగుతున్న బిగ్‌బాస్ బ్యూటీ ప్రియాంక

by Hamsa |   ( Updated:2024-03-06 03:58:07.0  )
ప్రియుడు చేసిన పని వల్ల ఏడుస్తూ గోవా రోడ్లపై తిరుగుతున్న బిగ్‌బాస్ బ్యూటీ ప్రియాంక
X

దిశ, సినిమా: బుల్లితెర నటిగా పరిచయం అయిన ప్రియాంక జైన్ పలు సీరియల్స్‌లో నటించి మెప్పించింది. ఇటీవల బిగ్‌బాస్ సీజన్-7 షోలో పాల్గొని అద్భుతమైన ఆడ తీరుతో తన పాపులారిటీ పెంచుకుంది. ఈ అమ్మడు దాదాపు చివరి వరకు వచ్చినప్పటికీ విన్నర్ కాలేక పోయింది. ఇగ బిగ్‌బాస్ నుంచి వచ్చాక తన ప్రియుడితో కలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఆ వీడియోలను తన యూట్యూబ్ చానల్‌లో పెడుతుంది. తాజాగా, ప్రియాంక తన ప్రియుడితో పాటు ఇద్దరు స్నేహితులతో కలిసి గోవాకు వెకేషన్ కోసం వెళ్లింది. అయితే అక్కడ ఈ అమ్మడు ప్రియుడు శివకుమార్ చేసిన ఫ్రాంక్ వల్ల ప్రియాంక రోడ్లపై తిరుగుతూ ఏడ్చేసిందట.

అసలు విషయంలోకి వెళితే.. ప్రియాంక, శివ కుమార్‌తో పాటు మరో ఇద్దరు గోవా ట్రిప్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడున్న పలు ప్రదేశాలు చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేశారు. ఈ ఫొటోలను ప్రియాంక తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. అయితే అక్కడ ప్రియాంక కాస్ల ర్యాష్‌గా మాట్లాడిందని వారు ఆమెను వదిలేసి వెళ్లిపోయారు. ఓ లెటర్ రాసి పెట్టి మరీ నీ ప్రవర్తన మాకు నచ్చలేదు అందుకే వదిలేసి వెళ్ళిపోతున్నాము అని రాసి అక్కడ పెట్టి వెళ్లారు. ఇక తెల్లారిన తర్వాత నిద్ర లేచిన తర్వాత చూస్తే ఎవరూ లేకపోవడంతో ఫోన్ చేసింది. వారు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత అక్కడున్న లెటర్ చూసి విపరీతంగా ఏడ్చేసింది.

ఆ తర్వాత తనకు ఏం చేయాలో తెలియక రోడ్లపై వెతికింది. ఎంత వెతికినా వారు కనిపించకపోవడంతో మళ్లీ ఒకసారి ఫోన్ చేసింది. వారి ఫోన్ కలవకపోవడంతో హోటల్‌లోని రూమ్‌కి వస్తుండగా అప్పడే శివతో పాటు ఇద్దరు స్నేహితులు తనకు కనిపించారు. దీంతో ఊపిరి పీల్చుకుంది. ఒంటరిగా ఉంచడం ఏంటని వారు అడుగుతూ ఏడుపు మొదలెట్టింది. దీంతో ఆమె ప్రియుడు దగ్గరకు తీసుకుని క్షమాపణలు చెప్పడంతో పాటు అదంతా తానే కావాలని ఫ్రాంక్ చేసినట్లు వివరించాడు. ఆ తర్వాత ప్రియాంక శాంతించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో అది చూసిన వారు మా ప్రియాంకపై ఇలాంటి ప్రాంక్ అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed